తెలంగాణ కొత్త సచివాలయం ఓపెనింగ్ వాయిదా – ఫైర్ ఎఫెక్ట్ ?

తెలంగాణ కొత్త సచివాలయాన్ని కేసీఆర్ పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించాలని అనుకున్నారు. అది కూడా ఓ నేషనల్ ఈవెంట్ లా నిర్వహించాలనుకున్నారు. తెలంగాణలో గ్రామ గ్రామాన సంబురాలు చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నేతల్నీ పిలిచారు. కానీ చివరికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎన్నికల కోడ్‌కు … సచివాలయ ప్రారంభానికి సంబంధం ఏమిటో ఎవరూ చెప్పలేరు. ఎన్నికలు జరుగుతోంది రెండు ఎమ్మెల్సీ స్థానాలకు .ఒకటి టీచర్ల ఎమ్మెల్సీ.. ఇంకోటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ. ఈ రెండిటికి ఓటర్లు పరిమితం. ఇలాంటి ఎన్నికలకు సచివాలయం ఓపెనింగ్ కార్యక్రమాలు చేయకూడదని ఈసీ ఎప్పుడూ అభ్యంతరం చెప్పదు. అయితే అసలు ఎలాంటి అనుమతులు అడగకుండానే ప్రారంభోత్సవాన్ని రద్దు చేసుకున్నారు. సచివాలయం ప్రారంభోత్సవం రద్దు కావడంతో పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాలనుకున్న సభ కూడా వాయిదా పడినట్లేనని భావిస్తున్నారు.

అసలు కారణం ఎన్నికల కోడ్ కాదని.. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం అనే అనుమానాలు బలంగా ఉన్నాయి. సీఎం చాంబర్ ఉండే ఐదు, ఆరు అంతస్తుల్లోనే అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఎలాంటి కేసులు పెట్టలేదు. ఎలాంటి వివరాలూ బయటకు రానివ్వలేదు. ఎంత డ్యామేజ్ అయిందో తెలియదు. కానీ సచివాలయం ప్రారంభం అవుతుందనే ప్రచారం చేశారు. చివరికి వాయిదా వేయడంతో అగ్నిప్రమాద నష్టం తీవ్రంగానే ఉండి ఉంటుదని అందుకే వాయిదా వేశారని అనుమానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close