విశాఖలో గ్లాస్ బ్రిడ్జి క్రెడిట్ జగన్దేనంటూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు డప్పు కొట్టుకోవడం ప్రారంభించారు. అసలు అది నిర్మాణం ప్రారంభమైంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల తర్వాత. ఏడాదిలోనే పూర్తి అయింది. అయినా తమదే ఘనత తమదేనని వైసీపీ నేతలు చెప్పుకోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. మంచి పేరు వస్తుందని అనుకుంటే..చాలు ఇలాంటి వాటిలో దూరిపోయి.. జగన్ విజన్ అని చెప్పుకోవడం ప్రారంభిస్తారు.
వైసీపీ హయాంలో విశాఖలో చేసిందేమిటో అందరికీ గుర్తు ఉంది. ఫ్లోటింగ్ బ్రిడ్జి అని ఓ కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు. ఓపెన్ కూడా చేశారు. కానీ ఒక్క రోజుకే అది అలలకు కొట్టుకుపోయింది. ఆ నిర్వాకంతో అంతా నవ్వుల పాలయ్యారు. కేవలం టెస్టింగ్ చేశామని కవర్ చేసుకున్నారు కానీ.. అది ఎప్పటికీ సిద్ధం కాలేదు. ఎన్ని సార్లు పెట్టినా మళ్లీ అలలకు కొట్టుకుపోయింది.దాన్ని చుట్టేసుకుని ఎత్తుకుపోయారు. అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జి జగనన్న విజన్ అంటూ బయలుదేరారు.
నిజానికి గ్లాస్ బ్రిడ్జి ప్రతిపాదన జగన్ హయాంలోనిదే. ఏడు కోట్లు పెట్టి పీపీపీ పద్దతిలో నిర్మించడానికి సిద్ధమయ్యారు. కానీ ప్రైవేటుగా ఇవ్వాల్సిన వాటాల సంఖ్ తేలలేదమో కానీ.. ఫైనాన్షియల్ ఒప్పందం కుదుర్చుకోలేదు.దాంతో నిర్మాణం ప్రారంభం కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటినీ క్లియర్ చేసి.. శరవేగంగా నిర్మాణాలు ప్రారంభింపచేసింది. అప్పట్లో ప్రతిపాదనలు ఆపేసిందుకే..ఇప్పుడు క్రెడిట్ కావాలనుకుంటున్నారు వైసీపీ నేతలు. రేపు అమరావతి పూర్తయిన తర్వాత కూడా ఇలాగే క్రెడిట్ మాదే మాదే అని వస్తారేమో ?