అసలే టైం బాగోలేదు..అంతా పరేషాన్ లో ఉన్నారు. ఒక్క మాట అంటే తిరిగి రెండు అంటాం అంటూ కౌంటర్లు వచ్చిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో గిల్లితే గిల్లించుకోవాలి కానీ అరవకూడదు. కానీ ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యారు జగన్. చంద్రబాబుపై రెచ్చిపోయి వ్యాఖ్యలు చేయడంతో పరువు పోగొట్టుకుంటున్నారు. ప్రజల్లో మరింత పలుచున అయిపోతున్నారు.
ఇటీవల తెనాలి పర్యటనలో జగన్ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడారు. ఆయనపై 21కేసులు ఉన్నాయని , అంతమాత్రానా ఆయనను కొట్టొచ్చా అంటూ రౌడీ బ్యాచ్ కు మద్దతుగా కామెంట్స్ చేశారు. అసలే రౌడీలకు మద్దతు తెలపడం ఏంటని జగన్ పై ఫైర్ ఉన్న టీడీపీ సోషల్ మీడియా .. జగన్ కోర్టు కేసుల గురించి మరింత సమాచారం సేకరించింది. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటంతో చూసిన వైసీపీ శ్రేణులు సైతం నోరెళ్ళబెడుతున్నాయి.
మొత్తంగా 3,452 కోర్టు వాయిదాలతో జగన్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడని, ఆయనపై ఏడు ఈడీ , 11సీబీఐ కేసులతో సహా 31కేసులు ఉన్నాయని, ఈ కేసుల్లో వాదించేందుకు న్యాయవాదులకు గంటకు 12 -25లక్షల చొప్పున ఫీజ్ చెల్లిస్తారని, సగటున లీగల్ ఫీజుల కోసం జగన్ ఇప్పటివరకు 6,904కోట్లు ఖర్చు పెట్టారని టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది.
జగన్ పై నమోదు అయిన కేసుల్లో బెయిల్ తీసుకొని 5వేల రోజులుగా బయట తిరుగుతున్నారని , ఇప్పటివరకు కొన్ని కేసులు ట్రయల్ కి కూడా రాలేదని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో జగన్ ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టుగా ఉందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.