వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా కాలం తర్వాత తాడేపల్లి వచ్చారు. క్రిస్మస్కు పులివెందులకు వెళ్లి అక్కడ్నుంచి అటు బెంగళూరు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఏపీకి రావడం. ఆయన వచ్చినట్లుగా అందరికీ తెలియాలి కాబట్టి ప్రెస్మీట్ పెడుతున్నారు. ఆ తర్వాత ఆయన మళ్లీ బెంగళూరు వెళ్లే అవకాశం ఉంది. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి హోదా ఇవ్వలేదు అన్న కారణం పూర్తిగా తన బాధ్యతల్ని విస్మరించేశారు. రిలాక్స్ అవుతున్నారు. పార్టీని పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డికి వదిలేసి ఆయన ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటున్నారు. కానీ పోరాడుతున్నానని అని కవరింగ్ చేసుకోవడానికి.., అప్పుడప్పుడు ఓ ప్రెస్మీట్ పెట్టి తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ స్క్రిప్టులు రాసేది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి టీమే.
సంక్రాంతి పండగ సెలవులకు ముందు కాస్త కామెడీ
క్రిస్మస్ హాలీడేస్ అయిపోయాయి. ఇక సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. ఈ మధ్యలో తన ఉనికిని కాస్త చాటుకునేందుకు మీడియా ముందుకు వచ్చి లేనిపోని అబద్దాలు చెబుతూ ఉంటారు. ఆయన చెప్పే విషయాలు సీరియస్గా ఉండవు సరి కదా.. ట్రోలింగ్ స్టఫ్ గా మారుతాయి. దాదాపుగా నెల రోజులుగా ఆయన ప్రెస్మీట్ పెట్టలేదు కాబట్టి ఈ నెల రోజుల కాలంలో జరిగిన వ్యవహారాలపై ఆయన తన మాట్లాడనున్నారు. ఈ సారి ఆయన ప్రెస్మీట్లో వచ్చే మార్పు ఏమిటంటే ప్రభుత్వ విజయాలను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడమే. ముఖ్యంగా బోగాపురం ఎయిర్ పోర్టు తన హయాంలోనే 90 శాతం పూర్తి అయిందని క్లెయిమ్ చేసుకునేందుకు ఆయన ఏ మాత్రం సిగ్గుపడరు.
గూగుల్ అయినా… భోగాపురం అయినా జగన్ స్టైల్ అంతే!
2019లో పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి ఉన్న ప్లేట్ అధికారంతో పాటు అందింది. అయితే జగన్ రెడ్డి దాన్ని తన కాలుతో నెట్టేసుకున్నారు. ఘోరమైన పరిపాలన చేసి ఏ ఒక్క పని చేయలేకపోయారు. అన్నీ వదిలేసి.. తరిమేసి.. రుషికొండపై ఉన్న అద్భుతమైన ఆస్తిని కూలగొట్టి తన కోసం ప్యాలెస్ కట్టించుకున్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు. కానీ ఇప్పుడుమాత్రం ప్రభుత్వం అన్నీ పూర్తి చేస్తూంటే…. నేనే నేనే అని తెరపైకి వస్తున్నారు. కష్టపడి పెట్టుబడులు తెస్తూంటే .. అవి కూడా నా ఘనతే అని సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన మనస్థత్వం ఎలా ఉంటుందో ఇవే ఉదాహరణలు.
ప్రెస్మీట్లతో ఎంత కాలం – కనీసం క్యాడర్నూ పట్టించుకోరా?
జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఏడాదిన్నర అవుతుంది. ఈ ఏడాదిన్నరలో ఆయన 14 నెలల పాటు బెంగళూరులో గడిపి ఉంటారు. ఏపీకి కేటాయిచింది చాలా తక్కువ.క్యాడర్ కు అసలు సమయం కేటాయించ లేదు. ఎప్పుడో ఓ సారి తాడేపల్లిలో ఓ గంట సమయం కేటాయిస్తే.. క్యాడర్ వచ్చి సమస్యలు చెప్పుకుంటారేమోనని ఆయన ఆ పని కూడా చేయరు. చివరికి ఎవరికీ అర్థం కాని ట్వీట్లు చేస్తూ గడుపుతున్నారు. ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా హోదా లేదంటూ … అబద్దాలు, అవాస్తవాలు, క్రెడిట్ చోరీల కోసం ప్రయత్నిస్తూ రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికే చెల్లింది.
