ఢిల్లీ నుంచి జగన్ తిరుగుపయనం..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆకస్మికంగా ముగిసింది. నారాయణ అనే తన వ్యక్తిగత సహాయకుడు మరణించడంతో.. బాధాతప్త హృదయంతో..ఆయనకు నివాళి అర్పించడానికి ఢిల్లీలో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని జగన్ కడపకు పయనమయ్యారు. నారాయణ కుటుంబంతో.. వైఎస్ కుటుంబానికి మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. ఢిల్లీ నుంచి నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడ్నుంచి నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లెకు వెళ్తారు. నివాళి అర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత మళ్లీ అమరావతి చేరుకుంటారు.

గురువారం ఉదయం.. అనంతపురం జిల్లా పెనుకొండలో కియా పరిశ్రమను ప్రారంభించిన జగన్… హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లారు. హోంమంత్రి అమిత్ షా.. ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్లు ఖరారయ్యాయన్న సమాచారం రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లినట్లు చెబుతున్నారు. తీరా ఢిల్లీకి వెళ్లే సరికి… ఎవరిక అపాయింట్‌మెంట్లు ఖరారు కాలేదు. అర్థరాత్రి వరకూ ఎదురు చూసినప్పటికీ.. అమిత్ షా ఇంటి గేట్లు తెరుచుకోలేదు. ఈ రోజు.. ప్రధాని మోడీతో సమావేశం ఉందని… వైసీపీ వర్గాలు ప్రచారం చేశాయి. ఆయన కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన, అమ్మఒడి పథకాల ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారని చెప్పుకొచ్చారు. అయితే.. మోడీ అపాయింట్‌మెంట్ కూడా ఖరారు కాలేదని తెలుస్తోంది. అదే సమయంలో.. సహాయకుడు నారాయణ మృతి వార్త తెలియడంతో.. కడపకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పర్యటనలు.. అచ్చి రావడం లేదు. ఆయన ఎవరినైతే కలవాలని అనుకంటున్నారో.. వారందరూ చివరి క్షణంలో హ్యాండిస్తున్నారు. గతంలో ఢిల్లీ పర్యటనల్లోనూ అదే జరిగింది. తాజాగా అదే జరిగింది. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి సరైన టీమ్‌ను పెట్టుకోలేకపోయారని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి చేసిన కొన్ని ప్రకటనలు, పనుల వల్ల.. కేంద్రమంత్రులు ఆయనను దగ్గరకు రానివ్వడం లేదు. ఆయన పలుకుబడి పూర్తిగా తగ్గిపోవడం.. జగన్‌కు మైనస్‌గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ హాస్పిటల్ తరఫున హీరో రామ్ వకాల్తా, సోనూసూద్ ని చూసి నేర్చుకోమంటున్న నెటిజన్లు

హీరో రామ్ పోతినేని, "ఇది స్వాతంత్ర దినోత్సవమా లేక స్వర్ణా ప్యాలెస్ సంఘటనకు సంబంధించిన దినమా" అంటూ ప్రశ్నించడమే కాకుండా ఈ ఘటన విషయంలో ముఖ్యమంత్రి జగన్ ని అప్రతిష్టపాలు చేసే కుట్ర...

రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి : జగన్

రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం ఇచ్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... ప్రసంగించారు. ఈ సందర్భంగా...
video

మ‌రో అవార్డు ఖాయ‌మా కీర్తి.??

https://youtu.be/rjBv3K5FMoU మ‌హాన‌టితో జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. ఆ అవార్డుకి కీర్తి అర్హురాలు కూడా. అప్ప‌టి నుంచీ.. ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నే ఎంచుకుంటోంది. అందులో భాగంగా కీర్తి న‌టించిన మ‌రో...

కోలుకుంటున్న బాలు

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం క్షీణించింద‌న్న వార్త‌లు రావ‌డంతో.. యావ‌త్ చిత్ర‌సీమ ఉలిక్కిప‌డింది. ఆయ‌న ఆరోగ్యం బాగుండాల‌ని, క్షేమంగా తిరిగిరావాల‌ని అభిమానులంతా ప్రార్థించారు. ఆ ప్రార్థ‌న‌లు ఫ‌లిస్తున్నాయి. బాలు ఆరోగ్యం క్ర‌మంగా...

HOT NEWS

[X] Close
[X] Close