చైతన్య : అప్పుడు సీబీఐ ఎందుకు వద్దు..? ఇప్పుడెందుకు కావాలి జగన్ ..?

ఇప్పుడు వైసీపీ పదే పదే డిమాండ్ చేస్తున్న సీబీఐ… జగన్మోహన్ రెడ్డిపై పదకొండు కేసులు పెట్టింది. అన్నింటిలోనూ పక్కాగా సాక్ష్యాలున్నాయి. అందుకే ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు పోవాల్సి వస్తోంది. అప్పట్లో సీబీఐపై జగన్ అండ్ కో చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు. మరి ఇప్పుడు సీబీఐనే కావాలని ఎందుకంటున్నారు…? అప్పుడు సీబీఐ వద్దు.. ఇప్పుడు ముద్దు ఎందుకయ్యారు..!

హిందూజా కేసులో ఈడీ సాక్ష్యాలు బయట పెట్టినా సీబీఐ అచేతనం అందుకేనా..?:

ఈడీ రెండేళ్ల కిందట.. హిందూజా భూముల వ్యవహారంలో జరిగిన క్విడ్ ప్రో కోను బయటపెట్టి.. విచారణ చేయాలని… సీబీఐకి లేఖ రాసింది. దాన్ని సీబీఐ పట్టించుకోలేదు. మామూలుగా అయితే.. ఏళ్ల కిందటి కేసుల్ని బయటకు తీస్తున్న సీబీఐ.. కళ్ల ముందు జరిగిన నేరాన్ని.. అదీ తాను విచారిస్తున్న కేసుల్లోని అంశాలపై సాక్ష్యాలు దొరికితే ఊరుకోదు. కానీ.. ఊరుకుంది. జగన్‌ను లైట్ తీసుకుంది. దీనంతటికి కారణం.. కేంద్రంతో జగన్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలు. రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి.. బీజేపీకి మద్దతిచ్చి.. టీడీపీ లేకపోతే.. తామున్నామని భరోసా ఇచ్చి.. కేంద్రం ఏపీకి ఏమీ చేయకపోయినా పర్వాలేదని లాబీయింగ్ చేసిన ఫలితం. ఇలా సీబీఐకి వెళ్లే కేసులు కూడా అలా ఆగిపోతాయన్న అంచనాతోనే.. జగన్ …పదే పదే కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రమేయాన్ని కోరుతున్నారు.

వివేకా హత్య కేసులో సీబీఐ వస్తే తప్ప బయటపడలేమని భావిస్తున్నారా..?:

వివేకా హత్య కేసు చాలా సున్నితమైనది. హత్య జరిగిన విధానం, సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం జరగడం, గుండె పోటు అంటూ … సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరగడంతోనే.. పోలీసులు చాలా వరకూ క్లూ దొరికేసినట్లయింది. సాంకేతిక ఆధారాల కోసమే.. సమయం తీసుకున్నారు. అవీ దొరికాయని..రెండు, మూడు రోజుల్లో అరెస్టులు చూపిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. సీబీఐ విచారణ కోసం.. వైఎస్ కుటుంబీకులు అదే పనిగా ప్రయత్నాలు చేస్తూండటం అనుమానాలను తావిస్తోంది. అసలేం జరిగిందో.. సిట్ అధికారులు వివరించక ముందే.. తమపైనే గురి పెట్టారంటూ.. వైఎస్ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. సిట్ పై పూర్తి నమ్మకం ఉందని.. వ్యాఖ్యానించిన గంటల్లోనే వివకాకుమార్తె సీబీఐ విచారణకు అదే పనిగా డిమాండ్ చేయడం.. మరిన్ని అనుమానాలు తలెత్తేలా చేస్తోంది…

పోలీసులపై ఆరోపణలు చేసి ఏం సాధిస్తారు..?:

శాంతిభద్రతల అంశం రాజ్యాంగ పరంగా రాష్ట్రపరిధిలో ఉంటుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ.. పోలీసులు ప్రభుత్వ పర్యవేక్షణలోనే పని చేశారు. ఆ విషయం… వైసీపీ నేతలకు తెలియక కాదు.. అయినప్పటికీ.. వారు ప్రతీ విషయంలోనూ… ఏపీ పోలీసులపై నమ్మకం లేదనే ప్రకటనలు చేస్తున్నారు. అదే పనిగా.. పోలీసు అధికారులపై విమర్శలు చేస్తున్నారు. ఒకే సామాజికవర్గం వారున్నారంటూ.. అవాస్తవ అరోపణలు పదే పదే ప్రచారం చేస్తున్నారు. అసలు నిజాలు.. పోలీసు వర్గాలు బయటకు చెప్పినా పట్టించుకోవడం లేదు. సాక్షాత్తూ పోలీస్ బాస్ మీదనే ఆరోపణలు చేస్తున్నారు. ఆ తర్వాత… విధుల్లో అత్యంత కీలకమైన ఇంటలిజెన్స్ చీఫ్‌పై గురి పెట్టారు. ఎన్నికల సమయంలో.. ఈ ఇద్దరూ అత్యంత కీలకం. అయినా.. వీరితో పాటు మరికొంత మంది కీలక అధికారులపై గురి పెట్టి ఆరోపణలు చేస్తున్నారు. తప్పించాలని ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా చేయడం ఎన్నికల సమయంలో పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతీయడానికే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close