ఫామ్‌-7ల వెనుక పెద్ద కథే ఉంది..! టీడీపీలో నోరున్న నేతలు స్పెషల్ టార్గెట్..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సీనియర్లు ఎవరైనా ఉన్నారా..? రేవంత్ రెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, జనారెడ్డి, సంపత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య.. ఇలా లిస్ట్ రాసుకుంటూ పోతే.. కాంగ్రెస్ పార్టీలో బాగా నోరున్న నేతలు.. అందరూ ఓడిపోయారు. అంతకు కొద్ది రోజుల ముందు.. ప్రత్యేకంగా కేటీఆర్ వీరందరి పేర్లు చెప్పి.. ఓడిపోతారని.. జోస్యం చెప్పారు. ఆ జోస్యం నిజం అయింది. ఏపీ ఎన్నికల్లోనూ.. అలాంటిదేదో జరగబోయింది. టీడీపీ తరపున.. వైసీపీపై.. ప్రత్యేకంగా నోరు చేసుకునే… నేతల్ని టార్గెట్ చేసుకుని.. ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఫామ్‌-7ల వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు.

తెలుగుదేశం పార్టీ తరపున తమ గళం వినిపిస్తున్న నేతల నియోజకవర్గాల్లో భారీగా ఓట్ల తొలగింపు దరఖాస్తులు వచ్చాయి. ఎపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు గంటా, సుజయ్ కృష్ణా రంగారావు, దేవినేని ఉమ, నక్కా ఆనంద్ బాబు, పరిటాల సునీత, వరదాపురం సూరితో పాటు మరికొంతమంది నేతలను లక్ష్యంగా చేసుకుని ఫాం 7 దరఖాస్తులు పెట్టారు. కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఫాం 7 కింద 6, 363 దరఖాస్తులను చేయగా, ఇందులో కేవలం రెండు మాత్రమే అసలైనవి. బొబ్బిలిలో మంత్రి సుజయకృష్ణ రంగారావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 5,904 దరఖాస్తులు రాగా ఇందులో ఐదు మాత్రమే అసలైవి. భీమిలి నియోజకవర్గంలో 7,815దరఖాస్తులు రాగా అందులో 101 మాత్రమే రియల్. తెలుగుదేశం పార్టీ తరపున వైసీపీపై విరుచుకుపడే తూర్పుగోదావరిజిల్లా ఫిఠాపురం ఎమ్మెల్యే వర్మ కు అనుకూలంగా ఉన్న ఓటర్లను తొలగించాలని 5వేల 231దరఖాస్తులు రాగా అందులో కేవలం 127 మాత్రమే నిజమైనవి.

ఇక జగన్ ప్రత్యేకంగా టార్గెట్‌గా పెట్టుకున్న దేవినేని ఉమ ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణాజిల్లా మైలవరంలో 6,334 టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించాలని దరఖాస్తులు రాగా, 126 మాత్రమే నిజమైనవని ఆమోదించారు. తెలుగుదేశం తరపున స్వరం వినిపించే గుంటూరుజిల్లా మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరు నియోజకవర్గంలో 7, 158 దరఖాస్తులు వచ్చాయి. జగన్‌కు సరస్వతి భూముల వ్యవహారంలో జగన్ కు తలనొప్పి తెప్పించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గురజాల నియోజకర్గంలో 7, 859 దరఖాస్తులు వచ్చాయి. పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో 9వేల 748 దరఖాస్తులు రాగా, ఇందులో మూడింటిని మాత్రమే ఆమోదించారు. చెవిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఏకంగా 19వేల 225దరఖాస్తులు తొలగింపు కోసం వచ్చాయి. ఇందులో నిజమైనవి ఎనిమిది మాత్రమే. ఇవన్నీ చూస్తూంటే… అసలు ఏదో పెద్ద గూడుపుఠాణీనే ఉందన్న అనుమానాలు ప్రజల్లో బలంగా వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close