“ నన్ను అడిగితే వేమిరెడ్డికి ముక్కపచ్చలారని పిల్లతో పెళ్లి చేసేవాడిని కానీ ఆయన వెళ్లి బోరుబావిలో పడ్డాడు”.. అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురించి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఏ మాత్రం సంకోచించకుండా ..నీచంగా మట్లాడగలిగారు. ఇది ఒక్క మాట మాత్రమే. ఆయన అన్న మాటలు వింటే ఓ మహిళ వ్యక్తిత్వం మీద ఇటీవలి కాలంలో ఇంతలా దాడి చేసిన సందర్భాలు లేవని ఎవరైనా అనుకుంటారు. రాజకీయాలను రాజకీయాలుగా చూడలేక.. వ్యక్తిగత దాడులు చేయడం వైసీపీ నేతలకు జగన్ నేర్పిన విద్య. మహిళా నేతల్ని మానసికంగా వేధించడం కోసం వారి వ్యక్తిగత జీవితంపై తట్టుకోలేని నిందలు వేయడం వారి నైజం. అధికారం పోయినా వారు మారడం లేదు.
మహిళల్ని ఇలా వేధించేవారికి జగన్ రెడ్డి అండ
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. తన గురించి కోవూరు ప్రజలకు తెలియాలని నిర్భయంగా ప్రజలకు ఆమె తన జీవితం గురించి చెప్పారు. ఇప్పుడు ఏవో అంటగడదామని నల్లపురెడ్డి ప్రయత్నించారు. బురద చల్లేశారు. ఓ మహిళపై మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. పైగా తాను కట్టుబడే ఉన్నానని చెబుతున్నారు. వైసీపీలో ఇలాంటి సైకోలు నల్లపురెడ్డితో ప్రారంభం కాలేదు.. ఆయనతోనే ముగిసిపోదు. రోజా , కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ ఇలా లెక్క చెప్పుకుంటూ పోతే లెక్క లేనంత మంది వైసీపీ జాబితాలో ఉన్నారు. వీరంతా రాక్షసుల కంటే ఘోరం.
తల్లి, చెల్లిని కూడా వదలని దుర్మార్గులు
మహిళలను మహిళలతో అవమానించడం కూడా వైసీపీ డీఎన్ఏలో కీలకం. మహిళల క్యారెక్టర్ ను కించ పరిస్తే చాలు .. ఈ రాజకీయాలు మాకు ఎందుకు అని పారిపోతారని.. అప్పుడు తమదే రాజ్యం అని వైసీపీ నేతలు అనుకుంటారు. అందుకే దేనికైనా తెగిస్తారు. రాజకీయాలతో సంబంధం లేని నారా భువనేశ్వరి దగ్గర నుంచి హోంమంత్రి అనిత , చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ వరకూ ఎవర్నీ వదలని కంటక జాతి వైసీపీది. ఇలాంటి వారిని ప్రజలు తరిమికొట్టినా ఇంకా ఇంకా రాక్షసులు బయటకు వస్తూనే ఉన్నారు.
ఇలాంటి వారికి సరైన శిక్షలుండాలి !
మహిళల్ని కించ పరిచే వారికి .. చట్టాలు రక్షణ కల్పిస్తున్నాయో.. భావ ప్రకటన స్వేచ్ఛ అని వదిలేస్తున్నాయో తెలియడం లేదు కానీ.. బహిరంగంగా మహిళల జీవితాలపై మరకలు వేసే వారిని క్షమించకూడదు. సరైన శిక్షలు ఉండాలి. లేకపోతే రెచ్చిపోతూ ఉంటారు. ఇలాంటి అసరులు బయటకు వస్తూనే ఉంటారు. ఇన్ని మాటలు మాట్లాడిన నల్లపురెడ్డిని జగన్ ఒక్క మాట అనరు.. ఇంకా ప్రోత్సహిస్తారు. ఎందుకంటే.. అసలు మూలం అక్కడే ఉంటుంది మరి. వీరికి ప్రజలే సరైన బుద్ది చెప్పాలి,