వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై ఓ వ్యక్తి నడిరోడ్డుపై చెప్పుతో దాడి చేశారు. హరి్రసాద్రెడ్డి తన మహీంద్రా థార్ కారులో ఒక మహిళతో కలిసి వెళ్తుండగా, ఆమె భర్త అకస్మాత్తుగా కారును అడ్డగించారు. ఆగ్రహంతో ఊగిపోయిన సదరు వ్యక్తి, హరిప్రసాద్ రెడ్డి కారుపై దాడి చేశాడు. కారులో ఉన్న తన భార్యను బయటకు లాగి ఆమెపై చేయి చేసుకున్నారు. అనంతరం హరిప్రసాద్ రెడ్డిని సైతం చెప్పుతో కొట్టి నిలదీయడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది.
ఈ దాడికి ప్రధాన కారణం హరిప్రసాద్ రెడ్డికి, సదరు మహిళకు మధ్య ఉన్న వివాహేతర సంబంధమేనని సమాచారం. తన భార్యతో కలిసి కారులో తీసుకు వెళ్తున్నాడనే కోపంతోనే భర్త ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అంత జరుగుతున్నా హరిప్రసాద్ రెడ్డి ఎదురుదాడి చేయకుండా మౌనంగా ఉండిపోయాడు. దాడి అనంతరం సదరు వ్యక్తి తన భార్యను అక్కడి నుంచి తీసుకెళ్లగా, హరిప్రసాద్ రెడ్డి కూడా తన కారులో అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వివాహేతర బంధాల వ్యవహారంలో ఇలా వైసీపీ నేతలు రోడ్డున పడటం ఇదే మొదటి సారి కాదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై హరిప్రసాద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేయలేదని తెలుస్తోంది.