రుణమాఫీపై రాజకీయం..! రైతుల కోసం వైసీపీ ఆ మాత్రం చేయదా..?

రుణమాఫీ వాయిదాలు చెల్లించేందుకు… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో.. కొత్త రాజకీయం ప్రారంభమయింది. టీడీపీ నేతలు.. రుణమాఫీ వాయిదాలు చెల్లించాల్సిందేనేనే డిమాండ్‌ను ప్రారంభించారు. అయితే అలా అడగడం… అవివేకమని.. ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించడం… టీడీపీలోనే కాదు.. రైతుల్లోనూ కలకలం రేపుతోంది.

మిగిలిన రుణమాఫీ పూర్తి చేయమని అడగడం అవివేకమా..?

రైతుల కోసం పలు వరాలు ప్రకటించిన రైతురుణమాఫీలో మిగిలిపోయిన వాయిదాలను చెల్లించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. రుణమాఫీ హామీ తమ పార్టీది కాదని…ఆ పార్టీ చెబుతోంది. ఈ మేరకు తమ పార్టీ విధానాన్ని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. చంద్రబాబు రుణమాఫీ ప్రకటన పార్టీ తరపున చేశారని.. ఉమ్మారెడ్డి చెప్పారు. పార్టీ వాగ్దానానికి, ప్రభుత్వ వాగ్దానానికి తేడా ఉంటుందన్నారు. చంద్రబాబు 87వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని.. ఐదేళ్లలో చంద్రబాబు రూ. 11,400 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. మిగతా రుణాలు ఈ ప్రభుత్వం మాఫీ చేయాలనడం అవివేకమన్నారు.

నాలుగో విడత నిధులు మంజూరైనా ఆపేసిన రాజకీయం..!

2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రైతు రుణమాఫీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకు లక్షన్నర చొప్పున రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. లోటు బడ్జెట్ ఉన్నందున ఐదు విడతల్లో ఈ పక్రియ పూర్తి చేయాలనుకున్నారు. యాభై వేల రూపాయల లోపు ఉన్న రుణాలను… ఒక్క విడతలోనే మాఫీ చేశారు. అంత కంటే ఎక్కువ ఉన్న వారికి ఐదు విడతల్లో రుణవిముక్తి చేయాలని సంకల్పించారు. ఎన్నికల నాటికి మూడు విడతలుగా రుణమాఫీ పూర్తయింది. ఎన్నికలకు ముందు.. నాలుగో విడత రూ. 3,900 కోట్లను విడుదల చేసింది. బ్యాంకుల్లో తమ రుణవిమోచన పత్రాలు చూపి.. వివరాలు అప్ లోడ్ చేసుకున్న కొంత మందికి మాత్రమే నాలుగో విడత అందింది. ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు మారడంతో… ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది

ఒక్కో రైతుకు రూ. 50వేల నష్టం..!

విడతల వారీగా రుణమాఫీ చేయాలని నిర్ణయించుకున్నందున రైతుల వడ్డీ భారం కూడా మోయాలనుకుంటున్నారు. ఏడాదికి పదిశాతం వడ్డీ చొప్పున లెక్కించి ఇస్తున్నారు. అర్హులైన రైతులందరికీ రుణ ఉపశమన పత్రాలు ఇచ్చారు. ఈ పత్రాలు ఇప్పుడు పని చేయవని.. వారికి రుణమాఫీ చేసే అవకాశం లేదని దాదాపుగా తేల్చేసినట్లయింది. లక్షన్నర రుణమాఫీ అయిన కుటుంబానికి నాలుగో విడతలో 30వేలు అసలు 9వేలు వడ్డీ ఇవ్వాల్సి ఉంది. అలాగే చివరి విడతలో మరో పాతికవేలు ఇవ్వాల్సి ఉంది. దీని వల్ల ఒక్కో రైతుకు.. దాదాపుగా 50 వేల వరకూ.. నష్టం జరిగే అవకాశం ఉంది.

చెల్లిస్తే రాజకీయంగానూ జగన్‌కు మైలేజ్..!

రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్… రుణమాఫీ వాయిదాలను చెల్లించకపోతే… రైతుల్లో.. వ్యతిరేకత ఎదుర్కొనే ప్రమాదం ఉంది. రైతులకు సంబంధించి ఎన్నో నిర్ణయాలు తీసుకున్న సర్కార్… రుణమాఫీ విషయంలోనూ సానుకూలంగా వ్యవహరించాలనేది రైతుల అభిప్రాయం. ప్రభుత్వం ఏదైనప్పటికీ.. ప్రభుత్వం తరపున రైతులకు రుణవిమోచన బాండ్లను జారీ చేశారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిర్ణయం ఎవరు తీసుకున్నా… రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందంటున్నారు. అలాగే రాజకీయంగానూ… జగన్మోహన్ రెడ్డికి…రుణ వాయిదాల కిస్తీలు చెల్లిస్తే ప్రయోజనమే ఉంటుంది. చంద్రబాబు ఇచ్చిన హామీని.. ఐదేళ్లలో అమలు చేయలేకపోయారని.. తానే చేయాల్సి వచ్చిందని… టీడీపీపై ఎదురుదాడి చేయవచ్చు. మరి జగన్ ఏం చేస్తారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close