వైసీపీ నేతలు విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. బిల్ గేట్స్ కు ఇచ్చిన టీ కాఫీల దగ్గర నుంచి నెయ్యి కల్తీ .. హెరిటేజ్ కన్నా పెద్ద కంపెనీని అయినా ఇందాపూర్ చంద్రబాబుది అని చెప్పడం వరకూ చాలా విచిత్రమైన విషయాలు చెబుతున్నారు. వారేమీ అమాయకంగా ఈ విషయం చెప్పడం లేదు. కావాలనే చెబుతున్నారు. చాలా మంది నవ్వుకుంటారని తెలిసి కూడా చెబుతున్నారు. ఎందుకంటే.. ఆ మాటల్ని నమ్మేవాళ్లున్నారు. చదువు రాని వాళ్లు… సోషల్ మీడియాను మాత్రమే చూసి నిజం అని నమ్మేవాళ్లు వైసీపీ ఓటర్లు . ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు .. ఆ ఓటర్లను తమతోనే ఉంచుకునేలా..తమ మాయా ప్రపంచంలోనే ఉండేలా ఈ ప్రకటనలు చేస్తున్నారు.
నవ్వుకుంటున్నారని తెలిసినా.. ఆగని ప్రహసనం
విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్న నేతలకు తాము చెప్పేది అబద్ధమని, ప్రపంచం మొత్తం తమను చూసి నవ్వుకుంటుందని తెలియదా? అంటే.. ఖచ్చితంగా తెలుసు! కానీ, ఇది వారి అమాయకత్వం కాదు, ఒక పక్కా ప్లాన్. విద్యావంతులు తమను నమ్మరని వారికి క్లారిటీ ఉంది. అందుకే వారి టార్గెట్ అంతా గ్రామీణ ఓటర్లు ,కేవలం సోషల్ మీడియా క్లిప్పింగ్లనే నిజమని నమ్మే ఒక వర్గం జనం. తమ పార్టీ అగ్రనేతలు ఏదో ఒక బాంబు పేల్చారు కాబట్టి అది నిజమే అయ్యుంటుందని గుడ్డిగా నమ్మే ఓటర్లను తమ మాయా ప్రపంచంలోనే బంధించి ఉంచాలనేది వీరి అసలు ఎత్తుగడ.
చదువులేని ఓటర్లే పెట్టుబడి
వైసీపీ వ్యూహం ప్రకారం.. విమర్శలు చేసే మేధావుల కంటే, తాము చెప్పే అబద్ధాలను వేదంలా నమ్మే అమాయకపు ఓటర్లే ముఖ్యం. అందుకే, అసలు లాజిక్ లేని విషయాలను కూడా అత్యంత సీరియస్‌గా చెబుతుంటారు. చంద్రబాబును విలన్‌గా చూపించడానికి అడ్డగోలు కథలు అల్లడం, లేని కంపెనీలను ఉన్నట్లుగా చూపిస్తూ మైండ్ గేమ్ ఆడటం వీరి ప్రత్యేకత. చదువుకున్న వారు ఎంత వెక్కిరించినా, సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా.. క్షేత్రస్థాయిలో తమ ఓటర్ల మనసులో ఆ చిన్న అబద్ధపు బీజాన్ని నాటగలిగితే చాలు అని వారు భావిస్తుంటారు.
సోషల్ మీడియా ప్రచారమే ప్రధానాస్త్రం
వైసీపీ అనుకూల సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ విచిత్రమైన వ్యాఖ్యలు అగ్నిలా వ్యాపిస్తాయి. అక్కడ నిజానిజాల పరిశీలన ఉండదు. కేవలం నేతలు చెప్పిన ఆడియో విజువల్స్ మాత్రమే ఉంటాయి. మా నాయకుడు చెప్పాడు కాబట్టి అది నిజమే అని నమ్మే ఒక ఎకో-చాంబర్‌ను వారు సృష్టించుకున్నారు. ఈ మాయా ప్రపంచంలో చంద్రబాబు బిల్ గేట్స్ దగ్గర పనివాడిగా కనిపిస్తాడు, ప్రపంచంలోని పెద్ద కంపెనీలన్నీ బాబు బినామీలుగా మారిపోతాయి. ఇలాంటి వింత వాదనలతో ఓటర్ల ఆలోచనా శక్తిని మొద్దుబార్చడమే ఈ రాజకీయ క్రీడ ఉద్దేశం.
నవ్వుల పాలవుతున్నా.. నమ్మకమే బలం
వైసీపీ నేతలు చేస్తున్న ఈ వింత ప్రకటనలు వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం . అయితే, వారు పడిపోయిన ప్రతిసారీ ఒక కొత్త అబద్ధాన్ని వెతుక్కుని వస్తున్నారు.నఅబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమవుతుందిన అన్న నాజీల సిద్ధాంతాన్నినవీరు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ప్రజలు నవ్వుకుంటున్నా సరే, తమ ఓటర్లను తమ మాయావలయంలోనే ఉంచుకోవడానికి ఇలాంటి సెటైరికల్ డ్రామాలు ఇంకా ఎన్నెన్ని చూడాలో..!