అతిధీమాతోనే తెదేపా పెడన పీఠం చేజార్చుకొందా?

తెదేపాకి కంచుకోట వంటి కృష్ణాజిల్లాలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అందుకు అతి ధీమాయే కారణం కావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తెదేపా కాస్త ఏమరుపాటుగా ఉన్నందున దానికి దక్కవలసిన పెడన మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ పదవిని వైకాపా ఎగురేసుకు వెళ్ళిపోయింది. పెడన మున్సిపల్ కౌన్సిల్లో రెండు పార్టీలకి చెరో 11మంది కౌన్సిలర్లు ఉన్నారు. కానీ తెదేపా ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్నందున తెదేపాకే అధ్యక్ష పీఠం దక్కాలి. ఖచ్చితంగా తమకే దక్కుతుందని తెదేపా చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ తెదేపా కౌన్సిలర్ స్రవంతి ఎవరూ ఊహించని విధంగా వైకాపా చైర్మన్ అభ్యర్ధి బండారు ఆనంద్ ప్రసాద్ కి ఓటేయడంతో అయన అనూహ్యంగా గెలుపొందారు. ఇది చూసి తెదేపా షాక్ అయ్యింది. అసలు తమ కౌన్సిలర్ ఒకరు వైకాపాకి ఓటేస్తారని వారు ఊహించకపోవడం చేతనే వారు తమ పార్టీ గెలుపు ఖాయం అనే ధీమాతో వ్యవహరించారు. ఆ ధీమాయే తెదేపా కొంప ముంచింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు స్రవంతిపై తెదేపా క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. కానీ జరిగిన నష్టాన్ని సరిదిద్దలేరు. ఆమె కూడా వైకాపాలో చేరిపోతే తెదేపాకి ఒక కౌన్సిలర్ తగ్గిపోతారు. వైకాపా మరి కొంత బలపడుతుంది. మరి తెదేపా ఏవిధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.

పెడన మండల పరిషత్ వైకాపా చేతిలోనే ఉంది. దానిలో వైకాపాకి ఆధిక్యత ఉన్నందున వైకాపాకి చెందిన అచ్యుతరాజు మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పార్టీ వేరు.. ప్రభుత్వం వేరంటున్న ఆర్ఆర్ఆర్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో విందు భేటీ నిర్వహించారు. ఆయన రాజకీయం కొద్ది రోజులుగా బీజేపీ చుట్టూనే తిరుగుతోంది. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా.. పొగుడుతూ...

“ఉస్మానియా” పాపం ప్రతిపక్షాలదేనా..?

ఉస్మానియా ఆస్పత్రి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారింది. బుధవారం పడిన వర్షానికి ఉస్మానియా మొత్తం నీళ్లు నిండిపోవడం.. చికిత్స గదుల్లో కూడా నీరు చేరడంతో.. విపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఐదేళ్ల...

సంతోష్ కుమార్ చాలెంజ్ అంటే స్వీకరించాల్సిందే..!

కొద్ది రోజులుగా మీడియాలో.. సోషల్ మీడియాలో ఓ వార్త రెగ్యులర్‌గా కనిపిస్తోంది. అదే.. ప్రభాస్.. బ్రహ్మానందం.. సమంత లాంటి స్టార్లు.. మొక్కలు నాటుతూ.. చాలెంజ్‌ను కంప్లీట్ చేయడం.. ఆ చాలెంజ్‌ను మరికొంత...

కరోనా రాని వాళ్లెవరూ ఉండరు : జగన్

భవిష్యత్‌లో కరోనా వైరస్ సోకని వాళ్లు ఎవరూ ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని.. ఎవరూ వాటిని ఆపలేరని వ్యాఖ్యానించారు. కరోనా ఆపడానికి...

HOT NEWS

[X] Close
[X] Close