బాహుబ‌లి 2… ప్రశ్నల‌కు స‌మాధానాలు రేపే!

బాహుబ‌లి మానియా మ‌ళ్లీ మొద‌లైంది. చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు చేరుకోవ‌డంతో ప్రమోష‌న్ల హంగామా మొద‌లైంది. బాహుబ‌లి 2 చుట్టూ ఎన్ని ప్రశ్నలో. ఇంకెన్ని సందేహాలో. వీట‌న్నింటికీ రాజ‌మౌళి అండ్ టీమ్ క్లారిటీ ఇవ్వబోతోంది. ఇందుకు సంబంధించి శుక్రవారం సాయింత్రం 6 గంట‌ల‌కు హైదరాబాద్‌లో చిత్రబృందం ఓ ప్రెస్ మీట్ నిర్వహిస్తోంది. బాహుబ‌లి 2కి సంబంధించిన తొలి ప్రమోష‌న్ ఈవెంట్ ఇదే. ఇంత‌కీ ఈ ప్రెస్ మీట్‌లో ఏం చెప్పబోతున్నారు? ఈ మీడియా మీట్ ఉద్దేశం ఏమిటి?

  • బాహుబ‌లి 2 పోగ్రెస్ ఏమిట‌న్న విష‌యంలో రాజ‌మౌళి క్లారిటీ ఇవ్వబోతున్నారు. కాస్త టాకీ. 5 పాట‌లు మిన‌హా షూటింగ్ పూర్తయిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్రక‌టించ‌నున్నారు.
  • అక్టోబ‌రు 23న ప్రభాస్ పుట్టిన రోజు. ఆ రోజు నుంచి టీజ‌ర్ల హంగామా మొద‌ల‌వ్వనుంది. అక్టోబ‌రు 23 న తొలి టీజ‌ర్ రాబోతోంది. ఎప్పుడెప్పుడు ఏయే టీజ‌ర్లు విడుద‌ల చేయ‌నున్నారో.. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మీడియాకు క్లారిటీ ఇవ్వనున్నారు.
  • బాహుబ‌లిలో పాత్రల‌న్నీ పాపుల‌ర్ అయ్యాయి. వాటిని కామిక్స్‌, టాయ్స్‌గా విడుద‌ల చేయ‌న్నారు. అందుకు సంబంధించిన విష‌యాల్ని మీడియాతో పంచుకోనున్నారు రాజ‌మౌళి.
  • బాహుబ‌లిలో కొత్త పాత్రలు, కొత్త పాత్రధారులు ఎవ‌రైనా ఉన్నారా, ఉంటే ఎవ‌రు, ఆయా పాత్రల్ని చేస్తోందెవ‌రు? ఈ విష‌యాలపై రాజ‌మౌళి క్లారిటీ ఇస్తారు.
  • బాహుబ‌లి 2 క‌థ ఇదీ అంటూ సోష‌ల్ మీడియాలో ఓ క‌థ ప్రచారంలో ఉంది. దానిపై కూడా రాజ‌మౌళి స్పందించే అవ‌కాశ ఉంద‌ని తెలుస్తోంది.
Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com