ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిపై నిషేధానికి ఏడాది

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌పై నిషేధం విధించి మంగళవారానికి ఒక సంవత్సరమయింది. తెలంగాణ అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం సందర్భంగా తడబడటాన్ని పరిహాసం చేస్తూ కార్యక్రమాలు ప్రసారం చేశారనే ఆరోపణలపై ఎమ్ఎస్ఓలు టీవీ9, ఏబీఎన్ ఛానళ్ళపై అప్రకటిత నిషేధాన్ని విధించాయి. అయితే పేరుకు ఎమ్ఎస్ఓలు అని చెబుతున్నప్పటికీ అసలు నిషేధం విధించింది కేసీఆర్ ప్రభుత్వం అన్నవిషయం అందరికీ తెలిసిందే. అయితే టీవీ9 ప్రసారాలను ఆరునెలలక్రితం పునరుద్ధరించినప్పటికీ ఏబీఎన్‌పై నిషేధం కొనసాగుతోంది.
నిషేధంపై మంగళవారం హైదరాబాద్‌లో ఒక సదస్సు జరిగింది. జర్నిలిస్టు నాయకులు శ్రీనివాసరెడ్డి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, నాగం జనార్దనరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎర్రబెల్లి దయాకరరావు, దాసోజు శ్రవణ్, చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒకరకంగా చూస్తే ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణకు సన్నిహితులైన రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం వెంటనే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని వక్తలంతా డిమాండ్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ సన్ మళ్లీ అరెస్ట్..!

గురువారం సాయంత్రమే కడప జిల్లా జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. పాత కేసులేవీ అరెస్ట్ చేయడానికి లేకపోవడంతో... ...

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే అమరావతిలో రాజధాని.. !

అభివృద్ధి వికేంద్రీకణలో భాగంగానే అమరావతిని రాష్ట్రం మధ్యలో పెట్టామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాజధానిపై వైసీపీ నేతల ద్వంద్వ వైఖరిని మరోసారి మీడియా ముందు పెట్టారు. ఎన్నికలకు ముందు...

క‌థ‌లు వింటున్న త్రివిక్ర‌మ్‌

స్వ‌త‌హాగా త్రివిక్ర‌మ్ మంచి ర‌చ‌యిత‌. ఆ త‌ర‌వాతే ద‌ర్శ‌కుడ‌య్యాడు. త‌న క‌థ‌ల‌తోనే సినిమాలు తీశాడు. తీస్తున్నాడు. `అ.ఆ` కోసం ఓ న‌వ‌ల ని ఎంచుకున్నాడు. ర‌చ‌యిత్రికి కూడా క్రెడిట్స్ ఇచ్చాడు. అయితే.. క‌థ‌ల...

ఆత్మ‌క‌థ రాస్తున్న బ్ర‌హ్మానందం

అరగుండుగా `అహ‌నా పెళ్లంట‌`లో న‌వ్వించాడు బ్ర‌హ్మానందం. అది మొద‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కూ వంద‌లాది చిత్రాల్లో హాస్య పాత్ర‌లు పోషించి, తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. ప‌ద్మ‌శ్రీ‌తో ప్ర‌భుత్వం...

HOT NEWS

[X] Close
[X] Close