జ్యో అచ్యుతానందకు శామిలీ షాక్

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నారా రోహిత్, నాగ శౌర్య కలిసి నటిస్తున్న సినిమా ‘జ్యో అచ్యుతానంద’. వారాహి చలన చిత్ర బ్యానర్లో నిర్మించబడుతున్న ఈ సినిమాలో మొదటి హీరోయిన్ ఓకే అవ్వగా రెండవ హీరోయిన్ గా శామిలీని అడిగారట. ‘ఓయ్..!’ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన బేబీ శామిలీ.. ఆ సినిమా అపజయపాలవ్వడంతో కాస్త నిరాశ చెంది సినిమాలకు కొద్ది గ్యాప్ ఇచ్చింది.

ఇప్పుడు మళ్లీ వరుసెంట సినిమాలు చేసేందుకు సిద్ధమైన ఈ భామ తమిళంలో విక్రం ప్రభు హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తుంది. ఇక అదే కాకుండా ధనుష్ సినిమాకు కూడా సైన్ చేసిందట. అయితే తమిళంలో మళ్లీ ఫాం కొనసాగిస్తున్న ఈ భామని తెలుగులో జ్యో అచ్యుతానందలో రెండవ హీరోయిన్ గా అడిగేసరికి అమ్మడు సారీ అని చెప్పిందట. ముందు దర్శక నిర్మాతలు చెప్పిన దానికి ఆలోచిస్తానని చెప్పినా చివరకు సినిమాలో నటించే వీలులేదని షాక్ ఇచ్చిందట.

ఫిబ్రవరిలో చిత్రీకరణ మొదలు పెట్టనున్న ఈ సినిమాకు ఇంకా రెండవ కథానాయిక కుదరక పోవడంతో ఆమెని వెతికే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. వారాహి చలన చిత్ర బ్యానర్లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఊసలు గుసగుసలాడే లానే మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతుందని టాక్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com