ఏపీ లిక్కర్ స్కాంలో డబ్బుల కట్టలు ఎక్కడెక్కడ దాచి పెట్టారన్నది మెల్లగా బయటకు వస్తోంది. తాజాగా ఏ 40 వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ శివారులోని శంషాబాద్ వద్ద ఓ ఫామ్ హౌస్ లో దాచి ఉంచిన నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ. 11 కోట్ల నగదు ఆ పెట్టెల్లో ఉన్నట్లుగా గుర్తించారు. ఇది ఓ చిన్న భాగమే. డబ్బులను దాచి పెట్టిన వారు ఇస్తున్న అరకొర సమాచారంతో పట్టుకుంటున్నారు.
లిక్కర్ స్కాంలో కొన్నివేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయి. ఆ సొమ్ములో వీలైనంత వరకూ లాండరింగ్ చేసి సూట్ కేసు కంపెనీల ద్వారా వైట్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ నగదు రూపంలో ఇంకా కోట్లకు కోట్లకు ఉన్నాయి. అవి ఎక్కడ పెట్టారు అన్నది.. ఆయా నగదు కు బాధ్యులుగా వ్యవహరించిన వారికే తెలుసు. వరుణ్ అనే వ్యక్తి చెప్పిన దాని ప్రకారం రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అనేక మంది నిందితులు అసలు నిజాల్ని చెప్పాల్సిన ఉంది.
వందల కోట్ల విలువైన బంగారాన్ని కూడా లంచాల రూపంలో తీసుకున్నారు. ఆ బంగారం ఎక్కడ ఉందన్నది తేలాల్సి ఉంది. పోలీసుల విచారణలో ఉన్న వారు నిజాలు చెబితే.. వందల కోట్ల నోట్ల కట్టలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎంత మంది నిజాలు చెబుతున్నారన్నది మాత్రం ..దర్యాప్తు అధికారులకే తెలియడం లేదు.