ఒక్క రోజే రూ. 15వేల కోట్ల రిలీజ్ జీవోలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో అభివృద్ధి పనుల కోసం పెట్టిన ఖర్చు.. బడ్జెట్‌లో ఒక్క శాతం కూడా లేదు. పోలవరం సహా.. అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు.. గత ప్రభుత్వంలో ప్రారంభమయ్యాయి. ఫుల్ స్వింగ్‌లో ఉన్న కనీసం రూ. లక్ష కోట్ల రూపాయల పనులను.. ఈ ప్రభుత్వం నిలిపివేసింది. ఖర్చునూ ఆపేసింది. కానీ.. ఎనిమిది నెలల తరవాత..రూ. వేల కోట్ల ఖర్చుకు పాలనా అనుమతుల మంజూరులో మాత్రం హడావుడి చేస్తోంది. వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు చేపడతామంటూ… నిన్న ఒక్క రోజే… రూ. 12,308 కోట్లకు జీవోలు విడుదల చేసింది. 6 జిల్లాల్లో వాటర్‌గ్రిడ్‌ పనులు చేపట్టాలని.. ఈ జీవోల్లో పేర్కొన్నారు. తూ.గో జిల్లాకు 3,800, పగో జిల్లాకు 3,670 కోట్లు, శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో తాగునీటికి రూ.700 కోట్లు, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి రూ. 2,665 కోట్లు, ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి రూ. 833 కోట్లకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు.

పులివెందుల ప్రాంతంలో తాగునీటి సరఫరాకు రూ. 480 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఆస్పత్రుల అభివృద్ధికి రూ. 436.96 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నవరత్నాల అమల్లో భాగంగా ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు ఈ నిధులు విడుదల చేస్తున్నామంటూ ప్రకటించారు. ఏ ప్రభుత్వమైనా.. ప్రతిపాదనలు సిద్ధమైన తర్వాత.. ఖర్చును అంచనా వేసుకుని.. దానికి తగ్గట్లుగా.. నిధుల లభ్యతను చూసుకుని.. జీవోలు విడుదల చేస్తుంది. కానీ ప్రస్తుత ఏపీ సర్కార్.. ఏదో ముంచుకొస్తున్నట్లుగా వేల కోట్లకు పాలనా పరమైన అనుమతలు ఇస్తూ…పోతోంది. కానీ ఖర్చు మాత్రం కనిపించడం లేదు.

అడిగిన వారికి అడిగినట్లుగా.. అన్ని ప్రాంతాలకు రూ. వేల కోట్లు.. కేటాయిస్తూ.. జీవోలివ్వడం.. ప్రభుత్వ అధికారులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. వృద్ధి రేటు మందగించడంతో.. అప్పుల లభ్యత కూడా తగ్గిపోయింది. పెట్టుబడిదారులు రావడం లేదు. ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వంటి సంస్థలు… రుణాలివ్వడానికి నాలుగైదు సార్లు ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించకుండా… ఉత్త జీవోలు ప్రభుత్వం ఎందుకు విడుదల చేస్తుందో.. ఎవరికీ అర్థం కావడం లేదు. రేపు.. తాము అన్నీ చేద్దామనుకున్నామని.. కానీ చేయనివ్వలేదని.. చెప్పడానికి ఈ జీవోలు పనికొస్తాయన్న అంచనాతో.. అధికార పార్టీ ఉందన్న విశ్లేషణలు ఇతర పార్టీల వైపు నుంచి వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close