వ్య‌వ‌సాయానికి 24గంట‌లు ఉచిత విద్యుత్‌… కెసియార్‌

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు మేలు చేసే సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశంలోనే ఎవ‌రూ ఇవ్వ‌ని విధంగా తాము వ్య‌వ‌సాయానికి 24గంట‌ల ఉచిత విద్యుత్ ఇవ్వ‌నున్నామ‌ని తెలంగాణ సిఎం కెసియార్ ప్ర‌క‌టించారు. కొన్ని రోజుల పాటు ప్ర‌యోగాత్మ‌కంగా దీన్ని అమ‌లు చేసిన త‌ర్వాత వ‌చ్చే ర‌బీ నుంచి నిరంత‌ర ఉచిత విద్యుత్ అందిస్తామ‌ని తెలిపారు. తెరాస స‌భ్యుల హ‌ర్ష‌ధ్వానాల మ‌ధ్య ఆయ‌న ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. రాష్ట్రం విద్యుత్ ఉత్ప‌త్తిలో అనూహ్య ప్ర‌గ‌తి సాధించిందని ఆయ‌న గ‌ణాంకాల‌తో వివ‌రించారు. స‌బ్‌స్టేష‌న్ల సంఖ్య‌ను బాగా పెంచామ‌ని, విద్యుత్ ఉత్ప‌త్తి ప్లాంట్ల‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పై చ‌ర్చ సంద‌ర్భంగా బుధ‌వారం కెసియార్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ట్టుగా గాని నిరాటంకంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌డం అంటూ జ‌రిగితే అది తెలంగాణ రైతుల‌కు త‌ప్ప‌కుండా మేలు చేసేదే అవుతుంది అన‌డంలో సందేహం లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు గాను విప్ల‌వాత్మ‌క రీతిలో మిష‌న్ కాక‌తీయ చేప‌ట్టింది తెలంగాణ స‌ర్కార్‌. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన మిష‌న్ కాక‌తీయ స‌త్ఫ‌లితాలు ఇస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. దీని వ‌ల్ల గ‌త ఏడాదితో పోలిస్తే సాగు భూమి విస్తీర్ణం పెరిగింద‌ని తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు వెల్ల‌డించారు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయం మీద ఆధార‌ప‌డిన‌ రైతుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగానే ఉన్న నేప‌ధ్యంలో తెలంగాణ స‌ర్కార్ చేప‌డుతున్న ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు అవ‌స‌ర‌మైన‌వే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close