రూ. 25 కోట్లతో పావురాలగుట్టకు మహర్దశ..!

పావురాల గుట్టకు మహర్దశపట్టనుంది. పావురాల గుట్టలో రూ.25 కోట్లతో వైఎస్‌ఆర్ స్మృతివనాన్ని అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారిక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. హెలికాఫ్టర్ ప్రమాదానికి గురై.. కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గరలో ఉన్న పావురాల గుట్టపైనే ప్రమాదానికి గురయ్యారు. రెండు రోజుల సుదీర్ఘ గాలింపుల తర్వాత.. ఆ గుట్టపై.. వైఎస్ పార్ధీవదేహాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత పావురాల గుట్ట ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున.. పావురాల గుట్టకు వెళ్లి.. చూసి వచ్చేవారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పావురాల గుట్ట…కీలకంగా మారింది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి … సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ప్రతీ కార్యక్రమానికి ముందు.. పావురాల గుట్టకు వెళ్లేవారు. అక్కడ తండ్రి వైఎస్ కు ప్రార్థన చేసేవారు. ఆ తర్వాత ఇడుపుల పాయకు వెళ్లేవారు. అక్కడ వైఎస్ సమాధికి నివాళులర్పించేవారు. మొదట..కొన్నాళ్లు అలా జరిగినా..రాను రాను… పావురాగల గుట్టను పక్కన పెట్టేశారు. ఇడుపులపాయకు మాత్రమే వెళ్తున్నారు. వైఎస్ చనిపోయిన వెంటనే.. ముఖ్యమంత్రి అయిన రోశయ్య… పావురాల గుట్టను.. ఓ పర్యాటక ప్రదేశంలో.. ఓ స్మృతి వనంగా మారుస్తామని ప్రకటించారు. అయితే.. ఆయన అలా చేయక ముందే.. పదవి నుంచి దిగిపోయారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే.. అప్పటికే రాజకీయం మారిపోయింది. ఆయన కూడా పావురాల గుట్ట స్మృతి వనం గురించి ఆలోచించినా.. జగన్.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో… ఆ తర్వాత పట్టించుకోలేదు.

దాంతో.. పావురాల గుట్ట.. కేవలం వైఎస్ మరణం గురించి చెప్పుకునేటప్పుడు మాత్రమే వార్తల్లోకి వస్తుంది. ఇప్పుడు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ పావురాల గుట్ట విషయాన్ని బయటకు తీశారు. గుట్టను.. స్మృతి వనంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీని కోసం రూ. 25 కోట్లు కేటాయిస్తామని…మంత్రి బాలినేని ప్రకటించారు. వైసీపీకి ఇప్పుడు తిరుగులేని మెజార్టీ ఉంది కాబట్టి… ప్రజాధనం అయినా…స్మృతి వనం నిర్మించడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే పావురాల గుట్టకు మళ్లీ మహర్దశ వచ్చినట్లే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close