తెరాస ఎమ్మెల్యేకి రెండున్నరేళ్ళు జైలు శిక్ష

తెరాస ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డికి సంగారెడ్డి అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్ష రూ. 2,500 జరిమానా విధించింది. అతను తన అనుచరులతో కలిసి ఒక పారిశ్రామికవేత్తను బెదిరించి బలవంతంగా రూ. 15 లక్షలకు చెక్కు వ్రాయించుకొన్నట్లు నిరూపించబడటంతో కోర్టు ఈ శిక్ష వేసింది.

హైదరాబాద్ శివార్లలో గల పటాన్‌చెరు పారిశ్రామికవాడలో ఉన్న ఒక కర్మాగారంలో గత ఏడాది మే నెల 5వ తేదీన మహేష్ అనే ఒక కార్మికుడు ప్రమాదంలో మరణించాడు. ఆ సంగతి తెలుసుకొని తెరాస ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకొని చనిపోయిన కార్మికుడి కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఆ పరిశ్రమ యజమాని చందుకుమార్ అందుకు అంగీకరించారు. మహిపాల్ రెడ్డి అంతటితో ఊరుకోకుండా ఆ కార్మికుడిని చందు కుమారే హత్య చేయించారని వాదిస్తూ ఆయన చేత బలవంతంగా రూ. 15 లక్షలకు చెక్ సంతకం చేయించుకొని తీసుకొన్నారు. ఆయన వెంటనే ఈ విషయం గురించి పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. పోలీసుల దర్యాప్తులో ఎమ్మెల్యే దోషి అని తేలడంతో న్యాయమూర్తి డి. దుర్గాప్రసాద్ అతనికి రెండున్నరేళ్ళు జైలు శిక్ష, రూ. 2,500 జరిమానా విధించారు. ఆ తీర్పుపై జిల్లా కోర్టులో అప్పీలు చేసుకొనేందుకు గడువుకావాలని మహిపాల్‌ రెడ్డి అభ్యర్ధించడంతో న్యాయమూర్తి ఆయనకు నెల రోజులు గడువు ఇస్తూ విచారణను జనవరి 6కి వాయిదా వేశారు.

మహిపాల్‌ రెడ్డి అధికార పార్టీకి చెందినవాడే అయినప్పటికీ ఈ వ్యవహారం ఇంతవరకు వచ్చింది అంటే పార్టీ అధిష్టానం కూడా అతను తప్పు చేసాడని భావిస్తోందని, అందుకే అతనికి సహకరించలేదని అర్ధమవుతోంది. అదే సరయిన పద్ధతి కూడా. ఏపిలో అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని వెనకేసుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close