అంతర్ రాష్ర్ట మండలిలో చంద్రబాబు సభ్యుడుగా నియామకం

మోడీ ప్రధానిగా బాధ్యత చేపట్టిన కొత్తలో అనేక అనవసరమయిన స్టాండింగ్ కమిటీలను తొలగించి, నిర్ణయాలు తీసుకొనే అధికారం ఆయా శాఖల మంత్రులకే అప్పగించారు. దానిపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినా ఆయన చలించలేదు. అది చాలా మంచి నిర్ణయమేనని ప్రజలు భావించారు. దాని వలన అనవసరమయిన వృధా ఖర్చులు తగ్గించడమే కాకుండా, మంత్రులే స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం వలన పాలనలో వేగం, పారదర్శకత పెరుగుతుందని అందరూ భావించారు. కానీ ఏడాదిన్నర తిరిగేసరికి మోడీ ప్రభుత్వం కూడా మళ్ళీ ప్రతీ పనికి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి అలవాటుపడిపోయింది.

తాజాగా కేంద్రం ఒక అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసింది. అది అంతర్ రాష్ట్ర వివాదాలు, విబేదాలు, సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. దానికి ప్రధాని నరేంద్ర మోడియే చైర్మన్ గా వ్యవహరిస్తారు. విశేషమేమిటంటే దానిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సభ్యుడిగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంతర్ రాష్ట్ర మండలిలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీలతో బాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, ఉత్తర ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్నపుడు ఈ మండలిలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా సభ్యుడిగా ఎందుకు చేర్చలేదో తెలియదు. అలాగే దక్షిణాదిన తమిళనాడుకి అటు కర్నాటకతో మరో వైపు కేరళతో కూడా నదీ జలాల వివాదాలున్నాయి. కానీ ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఎవరికీ ఇందులో స్థానం కల్పించలేదు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఇరుగుపొరుగు రాష్ట్రాలతో పెద్దగా సమస్యలు లేనప్పటికీ వాటికి ఈ మండలిలో చోటు కల్పించడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ ఈ మండలి ఏ సమస్యలను చక్కబెడుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close