ఇవ్వాళ్ళ జగన్ పుట్టిన రోజు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. యెదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. ఆయన పూర్తి పేరు ఆయన డిశంబర్ 21, 1972సం.లో కడప జిల్లా పులివెందులలో జన్మించారు. ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణించే వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడటంతో పార్టీని విడిచిపెట్టి మార్చి 12, 2011 సం.లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొన్నారు. ఆ తరువాత అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యి 16 నెలలు జైలులో గడిపారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించి అధికారంలోకి వస్తానని ఆత్మవిశ్వాసం ప్రదర్శించినప్పటికీ తెదేపా చేతిలో ఆయన పార్టీ ఓడిపోయింది. అప్పటి నుంచి వివిధ ప్రజా సమస్యల కోసం ప్రభుత్వంతో అలుపెరుగని పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అనేకమంది తెదేపా మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభలో జగన్ సీటు వద్దకు వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.అందుకు ఆయన వారందకీ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close