సోనియా, నెహ్రులపై ‘కాంగ్రెస్ దర్శన్’ లో విమర్శలు

కాంగ్రెస్ పార్టీకి ఆరాధ్య దైవాలు ఎవరంటే నెహ్రూ, ఇందిర, సోనియా, రాహుల్ గాంధీలేనని అందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 131వ వ్యవస్థాపక దినోత్సవం. కనుక ఈ సందర్భంగా పార్టీకి చెందిన ఆ నలుగురి గురించి పార్టీలో నేతలందరూ గొప్పగా చెప్పుకోవడం సహజమే. వారి గొప్పదనం గురించి పార్టీ పత్రిక ‘కాంగ్రెస్ దర్శన్’లో కూడా చెప్పుకొంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ డిశంబరు 15న స్వర్గీయ సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ వర్దంతి సందర్భంగా మహారాష్ట్ర నుండి వెలువడిన ఆ పత్రికలో వెలువడిన ఒక కధనం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి షాక్ కి గురి చేసింది.

“భారత్ మొట్ట మొదటి ప్రధాని స్వర్గీయ జవహార్ లాల్ నెహ్రూ, ఆనాడు ఉపప్రధాని మరియు హోం మంత్రిగా చేసిన సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ మధ్య తరచూ భేదాభిప్రాయాలు ఏర్పడేవి. ఆ కారణంగా వారు తరచూ రాజీనామాలకు సిద్దపడేవారు. పటేల్ చాలా దూరదృష్టితో ఇచ్చిన సలహాలను నెహ్రూ కనుక పాటించి ఉన్నట్లయితే భారతదేశానికి అనేక అంతర్జాతీయ సమస్యలు నివారింపబడి ఉండేవి. అలాగే చైనాని నమ్మరాదని పటేల్ చెప్పిన మాటలను కూడా నెహ్రూ పట్టించుకోకపోవడం వలన ఆ తరువాత ఆ దేశం నుండి భారత్ అనేక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది. కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకు వెళ్ళవద్దని పటేల్ ఇచ్చిన సలహాను కూడా నెహ్రూ పట్టించుకోకపోవడం వలన నేటికీ కాశ్మీర్ ఒక రావణకాష్టంలా మిగిలి ఉంది. చివరికి టిబెట్, నేపాల్ దేశాల విషయంలో కూడా పటేల్ ఇచ్చిన సలహాలను నెహ్రూ పట్టించుకోలేదు,” అని ‘కాంగ్రెస్ దర్శన్’ పత్రికలో వ్రాసారు.

ఇదే సంచికలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తండ్రి స్టెఫానో మైనోపై కూడా విమర్శలు గుప్పిస్తూ మరో కధనం వెలువడటం విశేషం. అందులో “సోనియా గాంధీ తండ్రి ఇటాలియన్ ఫాసిస్టు సైన్యంలో ఒక మామూలు సైనికుడు. ప్రపంచ యుద్దంలో ఫాసిస్టు సైన్యం ఘోర పరాజయం పాలయింది. ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకొన్న సోనియా గాంధీ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయిపోయారు. అది కూడా పార్టీ సభ్యత్వం తీసుకొన్న 62 రోజుల్లోనే కావడం విశేషం. ఆమె ప్రధాన మంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు కానీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు,” అని రెండవ కధనంలో వ్రాశారు.

కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రతిభింబించే ‘కాంగ్రెస్ దర్శన్’ పత్రికలో పార్టీ అధ్యక్షురాలి గురించి అంత చులకనగా, ఆ పార్టీకి ఆదిపురుషుడు వంటి నెహ్రూ గురించి ఈవిధంగా అనుచితంగా ప్రచురించినందుకు ముంబై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు ఆ పత్రిక సంపాదకుడు సంజయ్ నిరుపం పార్టీ అధిష్టానానికి క్షమాపణలు చెప్పారు. పార్టీ పత్రికను తనే చూస్తున్నప్పటికీ దాని రోజువారీ వ్యవహారాలు తను చూడటం లేదని కనుక పార్టీ పత్రికలో ఆ రెండు ఆర్టికల్స్ ఎవరు వ్రాసారో తనకు తెలియదని చెప్పారు. కానీ ఈ ఆర్టికల్స్ ఎవరు వ్రాసారో, ఆవిధంగా ఎందుకు వ్రాసారో కనుగొంటానని చెప్పారు. బహుశః ఎవరో ఉద్దేహ్యపూర్వకంగానే కుట్ర పన్నిఈవిధంగా చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వంత పత్రికలో నెహ్రూ అనుసరించిన విదేశీ విధానాలన్నీ తప్పు, దాని వలననే నేడు దేశానికి ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయని వ్రాయబడటంతో కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా తయారయింది. ఇంతవరకు మోడీ అనుసరిస్తున్న విదేశీ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ మొన్న మోడీ ఆకస్మికంగా లాహోర్ పర్యటనకు వెళ్లి వచ్చినందుకు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించింది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ స్వంత పత్రికలోనే ప్రచురితమయిన ఈ కధనంతో నోరు కట్టుకోవలసి వచ్చింది. అది కూడా సరిగ్గా కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవం జరిగే సమయానికి రావడంతో ఇంకా ఇబ్బందికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close