తెలుగులో కూడా అదే టైటిల్ తో రజిని సినిమా

ఎంతటి సూపర్ స్టార్ అయినా ఓ ఫ్లాప్ అతన్ని అధః పాతాలానికి తొక్కేస్తుంది అంటే దానికి మంచి ఉదాహరణ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజిని కాంత్ అని చెప్పాలేమో.. సౌత్ లో రజిని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది కొచ్చాడియన్, లింగా అపజాయాలు రజినికి తలనొప్పులు తెచ్చిపెట్టాయి. సినిమా విజయం సాధించిందా లేక అపజయ పాలైందా అనేది పక్కన పెడితే రజిని సినిమా కూడా గొడవల మూకలతో విడుదలయ్యే పరిస్థితి వచ్చింది.

అందుకే ప్రస్తుతం తీస్తున్న కబాలి.. తీయబోయే రోబో 2.0 విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న రజిని కబాలి ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి అదరగొడుతుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో మరోసారి రజిని డాన్ క్యారక్టర్ చేస్తున్నాడు. మొన్నటిదాకా మలేషియాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు చెన్నైకు షిఫ్ట్ అయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్న ఈ సినిమా తమిళ టైటిల్ కబాలి కాగా తెలుగు టైటిల్ మహాదేవగా ప్రచారం చేశారు.

కాని ఇటీవలే తెలుగు టైటిల్ తో కూడిన పోస్టర్ విడుదల చేశారు చిత్రయూనిట్. అయితే అందరు అనుకున్నట్టుగా మహదేవగా కాకుండా తెలుగులో కూడా కబాలిగా వచ్చేస్తున్నాడు రజినికాంత్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాత రజిని శంకర్ రోబో 2.0 షూటింగ్ లో పాల్గొననున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close