రెండోసారి పోస్ట్‌పోన్‌ అయిన కథకళి

విశాల్‌ లేటెస్ట్‌ మూవీ ‘కథకళి’ రెండోసారి పోస్ట్‌ పోన్‌ అయింది. జాతీయ అవార్డు గ్రహీత పాండిరాజ్‌ దర్శకత్వంలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి జనవరి 14న విడుదల చెయ్యాలనుకున్న విషయం తెలిసిందే. అయితే తెలుగులో సంక్రాంతికి నాలుగు భారీ చిత్రాలు రిలీజ్‌ వుండడం వల్ల వాటి మధ్య ఒక డబ్బింగ్‌ సినిమాను రిలీజ్‌ చెయ్యడం కరెక్ట్‌ కాదని భావించిన విశాల్‌ జనవరి 22న రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌కి యూనిట్‌తో సహా వచ్చిన విశాల్‌ ప్రెస్‌మీట్‌ కూడా పెట్టి 22న సినిమా రిలీజ్‌ అవుతోందని ఎనౌన్స్‌ చేశాడు. అయితే కొన్ని గంటల్లోనే మళ్ళీ సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు విశాల్‌. సెన్సార్‌ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల రిలీజ్‌ని వాయిదా వేస్తున్నామని, కొత్త రిలీజ్‌ డేట్‌ని త్వరలోనే ఎనౌన్స్‌ చేస్తామని విశాల్‌ చెప్పాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close