కేసీఆర్‌ – ఆర్‌కె ల మధ్య తుమ్మల దౌత్యం!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి మీడియా గ్రూప్‌ అధిపతి రాధాకృష్ణల మధ్య మొన్నమొన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక రాజకీయ నాయకుడు, ఒక మీడియా సంస్థ అధినేత అనే ధోరణుల్లో కాకుండా.. ఈ ఇద్దరూ వ్యక్తిగతమైన శత్రువులేమో అనిపించేంతగా.. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం.. ఒకరి పనిపట్టడానికి మరొకరు పంతం పూనడం.. వ్యవహరించడం చేస్తూ వచ్చారు. అయితే కొన్నాళ్లుగా వీరి మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న వాతావరణం కనిపిస్తోంది. తాజాగా ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య రాజీ కుదర్చడానికి తెలంగాణకు చెందిన సీనియర్‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ విందు భేటీని నిర్వహించి.. సక్సెస్‌ అయినట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజం చెప్పాలంటే.. కేసీఆర్‌- రాధాకృష్ణ ఇద్దరూ ఒకప్పట్లో చాలా సన్నిహిత మిత్రులు అని అంతా చెప్పుకుంటూ ఉంటారు. కేసీఆర్‌ను ‘ఒరేయ్‌’ అని పిలిచేంత చనువు కూడా రాధాకృష్ణకు ఉన్నదని అంతా అంటూ ఉంటారు. గతంలో కేసీఆర్‌ ఓపెన్‌ హార్ట్‌ కార్యక్రమం సందర్భంగా కూడా వీరిద్దరి చనువు, దగ్గరితనం అందరి దృష్టికి వచ్చింది. అయితే.. కాలక్రమంలో.. ఇద్దరి మధ్య అంతరం పెరిగింది. ఏబీఎన్‌ ప్రసారాలు తెలంగాణలో రాకుండా ఆగిపోవడం, సుదీర్ఘ కాలం ఆ వ్యవహారంపై రాధాకృష్ణ సుప్రీం కోర్టులో పోరాడి సాధించుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాతి నుంచి కేసీఆర్‌ పట్ల రాధాకృష్ణ ధోరణిలో మార్పు వచ్చిందని.. ఆయన రాతలు కాస్త మెత్తబడ్డాయని పలు వ్యాఖ్యలు వినిపిస్తూ వచ్చాయి. దానికి తగ్గట్లుగానే కేసీఆర్‌ చండీయాగం నిర్వహించినప్పుడు రాధాకృష్ణ ఎంచక్కా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య పూర్వపుస్థాయి సయోధ్యను కుదర్చడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయిట. తాజాగా కొన్ని రోజుల కిందట తెలుగుదేశం నుంచి తెరాసలోకి జంప్‌ చేసిన.. ఈ ఇద్దరు ప్రముఖులతోనూ చాలా సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన నివాసంలో ఓ అద్భుతమైన విందు భేటీని ఏర్పాటు చేశారుట. అక్కడితో ఇక పాత విషయాలు, పగలు, కక్షలు కార్పణ్యాలు, ఒకరి వెనుక ఒకరు గోతులు తీయడాలు అన్నీ మరచిపోయి.. ముందుకు నడుద్దాం అంటూ ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారని సమాచారం. చూడబోతే.. ఒకవైపు చంద్రబాబుతో సత్సంబంధాలు ఏర్పడడం, తెలుగుదేశం విమర్శల్లో తేడా రావడం, చీటికి మాటికి తెరాస సర్కారుపై విరుచుకుపడే ఆంధ్రజ్యోతి అధినేతతో సరికొత్తపాత మైత్రీ బంధం.. ఇవన్నీ కలిపి కేసీఆర్‌కు బంపర్‌ ఆఫర్‌ లాగా కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close