చిరుకి రూ.5 వేలు ఇచ్చి ఆదుకున్న నిర్మాత‌

ఇప్పుడంటే చిరంజీవి మెగా స్టార్‌. ఆయ‌న ఇల్లు.. హీరోల ఫ్యాక్ట‌రీ. చిరు సినిమా అంటే క‌ళ్లు మూసుకుని వంద కోట్ల వ్యాపారం జ‌రిగిపోతుంటుంది. వేల కోట్ల‌కు అధిప‌తి. అయితే… ఒక‌ప్పుడు ఆయ‌న కూడా రూపాయి రూపాయికి త‌డుముకున్న‌వాడే. చాలా ఏళ్లు మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవితం గ‌డిపిన వ్య‌క్తి. అలాంటి చిరు ఓసారి డ‌బ్బుల‌కు తెగ ఇబ్బంది ప‌డిపోయాడ‌ట‌. ఎవ‌రైనా అప్పుగా రూ.5 వేలు ఇస్తే బాగుణ్ణు అని త‌న‌కు తెలిసిన ప్ర‌తీ ఒక్క‌రినీ అడిగాడ‌ట‌. కానీ ఎవ్వ‌రూ ఇవ్వ‌లేద‌ట. ఆ స‌మ‌యంలో ఎమ్మెస్ రాజు ఆదుకున్నాడ‌ట‌. ఎమ్మెస్ రాజు అప్ప‌టికి చిరుతో సినిమాలేం చేయ‌లేదు. అయినా స‌రే, చిరుపై న‌మ్మ‌కంతో రూ.5 వేలు ఇచ్చార‌ట‌. ఇదంతా చ‌ర‌ణ్ పుట్ట‌క ముందు జ‌రిగిన క‌థ‌. ఈ విష‌యాన్ని ‘హ్యాపీ వెడ్డింగ్‌’ ప్రీ రిలీజ్ వేడుక‌లో గుర్తు చేసుకున్నాడు చ‌ర‌ణ్‌. ఈ కార్య‌క్ర‌మానికి నేను రావ‌డం నా బాధ్య‌త‌.. దానికి కార‌ణం ఇదీ… అంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయాడు. ”చిత్ర సీమ‌లో రాణించాలంటే ప్ర‌తిభ మాత్ర‌మే స‌రిపోదు. మంచిత‌నం కూడా ఉండాలి. మంచి త‌నం ఉంటే.. ప్ర‌తిభ లేక‌పోయినా ఏదో ఓ రోజు రాణిస్తారు. ఎమ్మెస్ రాజు కుటుంబం సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నా” అని చ‌ర‌ణ్ విష్ చేశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

కోవిషీల్డ్ …డేంజరేనా..?

కరోనా విజృంభణ సమయంలో ప్రాణాలు కాపాడుతాయని నమ్మి వేసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ లో లోపాలు ఉన్నాయని వ్యాక్సిన్ వేసుకున్న పలువురు చెప్తూ వచ్చినా మొదట్లో కొట్టిపారేసిన బ్రిటన్ ఫార్మా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close