మోడీని 120 సార్లు కాల్చి చంపినా తప్పు లేదు : సీపీఐ నారాయణ

సీపీఐ జాతీయ నేత నారాయణ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు కారణంగా.. నగదు కోసం..బ్యాంకుల్లో, ఏటీఎలలో క్యూలలో నిలబడి దేశవ్యాప్తంగా 120 మంది మరణించారని… ఆ కారణంగా మోడీని 120 సార్లు కాల్చి చంపినా తప్పు లేదన్నారు. పెట్రో ధరల పెంపుపై .. రేపు దేశవ్యాప్తంగా విపక్షాలన్నీ నిరసన చేపడుతున్నాయి. భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు మినహా కాంగ్రెస్ పార్టీ సహా.. దేశంలోని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. ఈ వివరాలు చెప్పేందుకు ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టిన నారాయణ.. మోడీపై విరుచుకుపడ్డారు.

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు..ఓ రోజు తగ్గుతున్నాయి..మరో రోజు పెరుగుతున్నాయి. కానీ.. దేశంలో మాత్రం.. పెట్రోల్ రేట్లు నిరంతాయంగా పెంచుకుటూ పోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో పెట్రోల్ రేటు లీటర్‌కు రూ. 86కి చేరింది. నెల రోజుల క్రితం ఇది రూ. 79 దగ్గరే ఉండేది. రూపాయి పతనం కారణంగా రేట్లు పెరుగుతున్నాయని చెబుతున్న కేంద్రం… తమ చేతుల్లో ఏమీ లేదన్నట్లుగా మాట్లాడుతోంది. పూర్తిగా చేతులెత్తేసింది. కోట్లాది మంది భారతీయుల జీవితాలను పెట్రో ధరలు అతలాకుతలం చేస్తున్నాయని, వారి కష్టార్జితం దోపిడికి గురవుతున్నాయన్న ఆందోళన విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. అన్నీ కలిసి బంద్‌కు పిలుపునిచ్చాయి.

పెట్రో ధరలను నియంత్రించడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికిప్పుడు నరేంద్రమోదీ తలుచుకుంటే… ఇంధనం ధరలు సులువుగా తగ్గించేయవచ్చని విపక్షాలు చెబుతున్నాయి. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014 మే నుంచి 2016 జూన్ వరకు.. తొమ్మిసార్లు.. ఎక్సయిజ్ టాక్స్ పెరిగింది. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చములు ధరలు బాగా తగ్గాయి. అప్పుడు ధరలు తగ్గిస్తే.. మళ్లీ పెరిగినప్పుడు ప్రజలు భరించలేరన్న కారణంతో కేంద్రం ఎక్సయిజ్ పన్నును పెంచింది. కానీ అంతర్జాతీయ మార్గెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు… ఆ ట్యాక్స్‌ను తగ్గించేయడం లేదు. ఫలితంగా.. అటు కేంద్రం పన్నులు.. ఇటు రాష్ట్రం పన్నులు కలిసి… ప్రజలకు తడిసి మోపెడవుతోంది. ఇది ప్రజలకు అసహనానికి గురి చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close