ఎన్టీఆర్ బయోపిక్: రకుల్ సంతకం చేయలేదు గానీ..

“చర్చలు జరుగుతున్నాయి. ‘యన్.టి.ఆర్’ బ‌యోపిక్‌లో శ్రీదేవి పాత్ర కోసం నన్ను సంప్రతించిన మాట నిజమే. అయితే… నేనింకా కథ వినలేదు” – ఇదీ రకుల్ ప్రీత్‌సింగ్‌ చెప్పిన మాట!

నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా… ఆయన తనయుడు బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘యన్.టి.ఆర్’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీదేవి పాత్రలో రకుల్ నటించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే… సినిమాకు ఇంకా సంతకం చేయలేదని ఆమె తెలిపారు. “ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో క్షణం తీరిక లేదు. షూటింగులతో బిజీ బిజీ. అవి పూర్తి చేసుకుని హైద‌రాబాద్‌ వచ్చాక కథ వింటా. శ్రీదేవికి నేను పెద్ద అభిమానిని. ఆమె అంటే ఎంతో గౌరవం. ‘యన్.టి.ఆర్’లో శ్రీదేవి పాత్ర పోషించడం నాకు పెద్ద సవాలే. ఆవిడ పాత్రకు నేను న్యాయం చేయగలనని నాపై నమ్మకంతో నన్ను సంప్రతించడం అదృష్టంగా భావిస్తున్నా. సినిమాకు సంతకం చేశాక… అధికారికంగా ప్రకటిస్తా” అని రకుల్ పేర్కొన్నారు. సినిమాకు సంతకం చేయలేదు గానీ… శ్రీదేవిగా రకుల్ నటించడం ఖరారు అయినట్టే అని ఆమె మాటల్లో అర్థమవుతుంది. శ్రీదేవి పాత్ర పోషించడానికి ఆమె ఎంతో ఆసక్తి చూపిస్తోంది. “ఆ పాత్ర చేస్తే ప్రేక్షకులు కొత్త రకుల్‌ని చూడొచ్చు” అని వ్యాఖ్యానించారంటే… రకుల్ ఎంత సుముఖంగా వున్నారో అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నీల‌కంఠ‌తో రాజ‌శేఖ‌ర్‌

షో సినిమాతో ఆక‌ట్టుకున్నాడు నీల‌కంఠ‌. మిస్స‌మ్మ త‌న‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ప‌లు అవార్డులు అందించింది. దాంతో క్లాస్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలంగా నీల‌కంఠ ఖాళీగా ఉన్నాడు. అయితే.. ఇప్పుడు...

అపెక్స్ భేటీలో ఏపీ, కేంద్రం నోళ్లు మూయిస్తాం: కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. స్నేహహస్తం చాచినా.. కావాలని కయ్యం పెట్టుకుంటోందని మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర విధానాలు కూడా సరిగ్గా లేవన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని...

13 నెలల్లో 13 జిల్లాలకు ఏం చేశారో చెబుతారా..?: చంద్రబాబు

ఐదేళ్ల పాలనలో 13 జిల్లాలకు తెలుగు దేశం హయాంలో ఏం చేశామో.. ఎలా అభివృద్ది వికేంద్రీకరణ చేశామో... టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాకు వివరించారు. పదమూడు నెలల్లో...వైసీపీ సర్కార్ ఏం చేసిందో...

మీడియా వాచ్‌: తీవ్ర సంక్షోభంలో ‘ఈనాడు’

తెలుగులో అగ్ర‌గామి దిన‌ప‌త్రిక ఈనాడు. ద‌శాబ్దాలుగా నెంబ‌ర్ వ‌న్‌గా చ‌లామణీ అవుతోంది. అయితే... క‌రోనా నేప‌థ్యంలో నెంబ‌ర్ వ‌న్ సంస్థ సైతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. క‌రోనా ఉప‌ద్ర‌వానికి ముందు ఈనాడు...

HOT NEWS

[X] Close
[X] Close