సీబీఐలో లంచాల పోరు..! సీఎం రమేష్‌పై చేసిన కుట్ర బయటకొచ్చిందా..?

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. రాజకీయ బాసుల కోసం.. వారి ప్రత్యర్థుల్ని కేసులతో వేటాడుతోందనే ఆరోపణలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. అయితే.. ఇప్పుడు సీబీఐలోని టాప్ టూ ఉన్నతాధికారుల మధ్య ఏర్పడిన వివాదంతో.. వాటికి సంబంధించిన సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ను సీబీఐ కేసుల్లో ఇరికించేందుకు .. దొంగ పత్రాలు సృష్టించిన వైనం.. ఇప్పుడు బయటపడింది. సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్‌ అరెస్ట్‌తో… తీగలాగడం ప్రారంభమయింది. ఓ కేసులో సతీష్‌బాబు సానా అనే వ్యక్తి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో రమేష్ పేరు ప్రస్తావించినట్లు ఒక స్టేట్‌మెంట్‌ను సృష్టించారు. ఆ స్టేట్‌మెంట్‌ను సృష్టించిన విచారణ అధికారి అయిన సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్‌ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

సెప్టెంబర్ 26న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం సతీష్‌బాబు సానా ఒక వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు దేవేందర్‌కుమార్ తప్పుడు సాక్ష్యాలను సృష్టించారు. అయితే ఆ రోజు సతీష్ ఢిల్లీలో లేరని విచారణలో వెల్లడైంది. దాంతో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరిపి దేవేందర్‌ను అరెస్ట్ చేశారు. వాస్తవానికి విచారణలో సతీష్ సానా ఇచ్చిన వాంగ్మూలానికి దేవేందర్‌కుమార్ నమోదు చేసిన వాంగ్మూలానికి సంబంధం లేదని అధికారులు తేల్చారు. సీఎం రమేష్ పేరును సతీష్ సానా చెప్పకపోయినా డీఎస్పీ దేవేందర్ కుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు గుర్తించారు. సతీష్ సానా ఢిల్లీలో ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదని, సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్ తప్పుడు స్టేట్‌మెంట్‌ను సృష్టించారని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన మాంసం ఎగుమతిదారు మొయిన్‌ ఖురేషీపై మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సతీశ్‌ సనా పేరు బయటకు వచ్చింది.

ఖురేషిని వేధించకుడా ఉండేందుకు సీబీఐ ఉన్నతాధికారులు రూ.5 కోట్లు డిమాండ్‌ చేసి, మూడు కోట్లు ముడుపులు పుచ్చుకున్నారన్నది ఆరోపణ. ఈ కేసులో ఆరోపణలన్నీ… సీబీఐలో టాప్ టూ పొజిషన్లలో ఉన్న అలోక్ వర్మ, రాకేష్ అస్థానాల చుట్టూ ఉన్నాయి. వీరిద్దిరి మధ్య వాటాల్లోనో.. ఆధిపత్య పోరాటంలోనే వచ్చిన తేడాలతోనే ఈ విషయం బయటపడింది. ఈ కేసులో సీఎం రమేష్‌ను కూడా ఇరికించేందుకు ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారి దొంగ పత్రాలు సృష్టించడం కలకలం రేపుతోంది. సీఎం రమేష్ ఇళ్లపై ఇటీవల ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఏమీ దొరికినట్లు అధికారికంగా ప్రకటించలేదు. కానీ మీడియాకు, బీజేపీ నేత జీవీఎల్ మాత్రం.. రూ. వంద కోట్ల అక్రమాలంటూ.. పేపర్లు అందాయి. అవి నిజమైనవో కావో క్లారిటీ లేకుండా వాళ్లు రాజకీయానికి వాడుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా సీబీఐ కేసులోనే ఇరికించే ప్రయత్నం చేసినట్లు బయటకు తెలియడం కలకలం రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close