సొంత డీఎస్పీని అరెస్ట్ చేసిన సీబీఐ..! వ్యవహారం మోడీ వరకూ వెళ్తోందా..?

దర్యాప్తు సంస్థల్ని రాజకీయాల కోసం వాడుకుంటే.. ఎలాంటి పరిస్థితి వస్తుందో.. ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ను చూస్తేనే అర్థమైపోతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితులుగా పేరు పొందిన ఇద్దరు అధికారులు సీబీఐలో టాప్ టూ పొజిషన్లో ఉన్నారు. కానీ వారిద్దరూ ఇప్పుడు.. కేసులను కొట్టేయించేందుకు కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారంటూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ కేసులు నమోదు చేసుకున్నారు. ఇందు కోసం దొంగ డాక్యుమెంట్లు కూడా తయారు చేస్తున్నారు. ఇలా దొంగ డాక్యుమెంట్లు తయారు చేశారని.. సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్ ను సీబీఐ అధికారులే అరెస్ట్ చేయడం… సంచలనం రేపుతోంది.

సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మకు, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థ్థానాకు మొదటి నుంచీ ఉప్పు నిప్పుగానే ఉండేది. ఖురేషీ అనే వ్యక్తికి సంబంధించిన కేసుకు సంబంధించి అలోక్‌ వర్మ ముడుపులు తీసుకున్నారంటూ రెండు నెలల క్రితం రాకేశ్‌ అస్థ్థానా కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి లేఖ రాశారు. రివర్స్‌లో అదే ఆరోపణపై ఇప్పుడు అస్థ్థానాపై సీబీఐ కేసు నమోదు చేయడం గమనార్హం. అలోక్‌ వర్మ, సీబీఐ, ఈడీల్లోని మరికొందరు అధికారులు కలిసి తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే సతీశ్‌ సన అనే వ్యక్తితో ఫిర్యాదు చేయించారని అస్థ్థానా మళ్లీ ఆరోపణలు చేశారు. వీరిద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. బీజేపీ రాజకీయ ప్రత్యర్థుల కేసులన్నింటినీ ఈ ఇద్దరు అధికారులే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కొన్ని ఇతర కేసులు వీగిపోవడంలోనూ.. వీరి పాత్ర కీలకంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.

సీబీఐ డీఎస్పీ దేవందర్ కుమార్ అరెస్ట్‌తో … ఈ వ్యవహారం… దేశంలో హాట్ టాపిక్ అయింది. అత్యున్నత దర్యాప్తు సంస్థలో అధికారుల ఇద్దరిపై అవినీతి ఆరోపణలు రావడం.. వారిలో వారే… ఆరోపణలు చేసుకోవడం.. దొంగ డాక్యుమెంట్లు కూడా తయారు చేయడం.. కలకలం రేపుతోంది. వారిలో వారే దొంగ డాక్యుమెంట్లు తయారు చేసుకుంటే.. ఇక రాజకీయ లక్ష్యాల కోసం.. ఇంకెన్ని దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి.. తమ రాజకీయ బాసులకు మేలు చేశారన్న ఆరోపణలు ఇతర పార్టీల వైపు నుంచి వస్తున్నాయి. దీని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. పరిస్థితి విషమిస్తూ ఉండటంతో అలోక్ వర్మ, రాకేష్ అస్తానాలను మోడీ తనను కలవాలని ఆదేశించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close