ట్విస్ట్ అదిరింది: చ‌ర‌ణ్ హీరో – ఎన్టీఆర్ విల‌న్‌ ?

రాజ‌మౌళి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్‌ల మ‌ల్టీస్టార‌ర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి మైండ్ బ్లాంక్ అయ్యే హాట్ గాసిప్ ఇది. ఇందులో రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర‌ల్లో క‌నిపిప్తారు? వాళ్లిద్ద‌రి మ‌ధ్య బంధ‌మేంటి? అనే విష‌యాల గురించి ఆరా తీస్తే.. ఓ స‌ర్‌ప్రైజింగ్ విష‌యం తెలిసింది. ఇందులో ఎన్టీఆర్‌ని ప్ర‌తినాయ‌కుడిగా చూపించ‌బోతున్నాడ‌ట రాజ‌మౌళి. ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్‌ల మ‌ధ్య పోరు.. ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అని తెలుస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ అంతా వీరిద్ద‌రి వైరం మీదే తిర‌గ‌బోతోంద‌ని టాక్‌.

ఓ శ‌క్తిమంత‌మైన ప్ర‌తినాయ‌కుడు, వాడ్ని కొట్టి కాక‌లు తీరిన మొన‌గాడు.. ఇది రాజ‌మౌళి సినిమా ఫార్ములా. మ‌రోసారి అదే పంథాలో రాసుకున్న క‌థ ఇది. అయితే ఈసారి ప్ర‌తినాయ‌కుడు మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా రాబోతున్నాడు.. ఎన్టీఆర్ రూపంలో. ప్ర‌తినాయ‌కుడు, క‌థానాయ‌కుడు మ‌ధ్య జ‌రిగే ఎత్తుకు పై ఎత్తులాంటి పోరే.. ఈ సినిమా. జై ల‌వ‌కుశ‌లో ఎన్టీఆర్ ప్ర‌తినాయ‌కుడిగానే క‌నిపించాడు. బ‌హుశా.. ఆ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న‌.. రాజ‌మౌళిలో ఈ కొత్త ఆలోచ‌న రేకెత్తించి ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా కోసం మ‌రింత ఫిట్‌గా త‌యార‌వ్వ‌డానికి ఎన్టీఆర్ క‌స‌ర‌త్తులు ప్రారంభించాడు. న‌వంబ‌రు 18 నుంచి ఈ మ‌ల్టీస్టార‌ర్ ప‌ట్టాలెక్క‌బోతోంది. సినిమా మొద‌లెట్టే ముందే క‌థ‌ని చెప్ప‌డం రాజ‌మౌళి ఆన‌వాయితీ. ఈసారీ అదే పాటించి క‌థ చెబుతాడా? లేదంటే సిల్వ‌ర్ స్క్రీన్ పైనే చూడ‌మంటాడా? వెయిట్ అండ్ సీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆయనొస్తే.. ఇక బీఆర్ఎస్ ను ఆపే వారే ఉండరు..!

తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ గా...

ఘోర రైలు ప్రమాదం… కవచ్ టెక్నాలజీ ఏమైంది..?

దేశంలో ఒక దాని వెనక మరొకటి వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ ఘటన మరవక ముందే మరో ఘటన జరుగుతుండటంతో రైలు ప్రయాణాలు అంటే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా...

లోక్‌సభ స్పీకర్‌గా టీడీపీ అభ్యర్థి అయితే ఏకగ్రీవం !

లోక్‌సభ స్పీకర్ గా టీడీపీ అభ్యర్థిని నిలబెడితే తాము మద్దతు ఇస్తామని ఇండియా కూటమి ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఇప్పటికే ఎన్డీఏపై ఒత్తిడి తెస్తున్నరని తమకు స్పీకర్ పదవి ఇవ్వాలని...

చైతన్య : ఓడిపోయినప్పుడే ఈవీఎంలు గుర్తు రావడం అసలు రోగం !

ఈవీఎంలపై భారత రాజకీయ పార్టీల్లో ఎవరికీ నమ్మకం లేదు. చివరికి బీజేపీ, కాంగ్రెస్ కు కూడా లేదు. కానీ వారి అభిప్రాయాలు ఫలితాలు వచ్చినప్పుడల్లా మారిపోతూండటంతోనే సమస్య వస్తోంది. గెలిచిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close