ఇలాంటి కేబినెట్ భేటీ ఎక్కడా జరగలేదు..! జరగదు కూడా..!

మంత్రివర్గ సమావేశం అంటే… ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పాల్గొంటారు. కానీ ముఖ్యమంత్రితో పాటు .. ఒక్క మంత్రి పాల్గొన్న కేబినెట్ సమావేశం … అది కూడా అప్పటి వరకూ ఉన్న పూర్తి స్థాయి కేబినెట్ సమావేశం.. మొదటి సారి జరిగింది. అదే తెలంగాణ మంత్రి వర్గ సమావేశం. నిన్న తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కేబినెట్ భేటీలో పాల్గొన్నది ముఖ్యమంత్రి కాకుండా.. ఒక్క మంత్రి .. మహమూద్ అలీ మాత్రమే. ఆయన ఎంత కీలక అంశంపై అయినా నోరెత్తే ప్రయత్నం చేయరు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు. దాంతో.. ఇక చర్చకు చాన్స్ లేనట్లే.

ఓ రకంగా తెలంగాణ మంత్రివర్గ భేటీ దేశంలోనే ఒక రికార్డు సృష్టించిందని చెప్పుకోవాలి. కేవలం ఇద్దరు సభ్యులతో మంత్రివర్గ సమావేశం జరగడం చారిత్రకమే. గతంలో ఎన్టీఆర్ మంత్రుల్లేకుండా పదిహేను రోజులకుపైగా… ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ… ఆయన కేబినెట్ సమావేశం పేరుతో.. ఎలాంటి భేటీ నిర్వహించలేదు. నిర్ణయాలు తీసుకోలేదు.. కాబట్టి.. ఆ రికార్డ్ ఎన్టీఆర్‌కు లేదు. అసెంబ్లీని రద్దు చేసిన సమయంలో మీడియాలో మాట్లాడినప్పుడు కేసీఆర్ ఎన్టీఆర్ కంటే గొప్పోడినని నిరూపించుకుంటానన్నట్లుగా మాట్లాడారు. ఇతర విషయాల సంగతేమో కానీ… ఒకే ఒక్క మంత్రితో.. నెల రోజులకుపైగా ప్రభుత్వాన్ని నడపడంతో పాటు… కేబినెట్ భేటీ కూడా నిర్వహించి… ఎన్టీఆర్ రికార్డును అధిగమించారనే చెప్పుకోవాలి.

రికార్డుల పరగా చూస్తే.. దేశంలో ఎంత చిన్న రాష్ట్రమైనా సరే… ఇంత వరకూ.. ఒక్క మంత్రితో కేబినెట్ భేటీ జరిగిన దాఖలాల్లేవని చెబుతున్నారు. పదవుల్లో ఉన్న మంత్రులు.. కేబినెట్ సమావేశానికి రావడానికి నిరాకరిస్తే.. అసలు వాయిదాలు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం… మంత్రులు లేవు. ఉన్నదల్లా ఒక్క మంత్రే. అయితే రాజ్యాంగపరంగా… మంత్రి మండలి అంటే.. ఇంత మంది మంత్రులు ఉండాలనే నిబధనల ఏదీ లేదు. కానీ పరిమితి ఉంది. అందుకే.. మంత్రులెవరూ లేనప్పుడు ముఖ్యమంత్రి ఒక్కరే నిర్ణయం తీసుకున్నా..అది మంత్రి మండలి నిర్ణయాల కిందకే వస్తుందంటున్నారు. కాబట్టి… రాజ్యాంగపరంగా కేసీఆర్ కేబినెట్ భేటీ రైటే. కాకపోతే.. కొత్తగా ఉందంతే.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close