30 నుంచి ఏపీ అసెంబ్లీ చివరి భేటీ..! వైసీపీ వైఖరేంటి..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 9 రోజులపాటు సమావేశాలు జరుగుతాయి.మూడు నెలల కాలానికి మాత్రమే.. ఓటాన్ అకౌంట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఆ లోపున… ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెడుతుంది. ఈ సారి బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు భారీగా కేటాయింపులు చేసే అవకాశాలు ఉన్నాయి. పింఛన్లు రెట్టింపు చేస్తున్నట్లు చంద్రబాబు చేసిన ప్రకటన నేపథ్యంలో ఆమేరకు కేటాయింపులు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. చిట్టచివరి సమావేశాలు కావడంతో.. సమావేశాల ప్రారంభంలో గవర్నర్‌ నరసింహన్‌ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించే అవకాశముంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరి సమావేశాలు హాజరవుతుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఈ అసెంబ్లీ కాలంలో అసలు హాజరు కాబోమని.. గతంలో ప్రకటించారు. అయితే.. ఇప్పుడు జగన్ పాదయాత్ర పూర్తయింది. ఎమ్మెల్యేలందరూ ఖాళీగానే ఉన్నారు. ఈ సమయంలోనూ.. అసెంబ్లీకి వెళ్లకపోతే.. తీవ్రమైన విమర్శలు వస్తాయి. పైగా.. ప్రతిపక్షం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ పరిస్థితుల్ని చక్కగా వినియోగించుకుటుంది. సంక్షేమ పథకాలతో హోరెత్తిస్తుంది. ఇప్పటి వరకూ.. ఏమైనా లోటు పాట్లు ఉంటే.. వాటి పై పెద్దగా చర్చ జరగకుండా… స్మూత్ గా ఎన్నికలకు వెళ్లిపోతుంది. ఈ విషయంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అన్న విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే.. ప్రజాస్వామ్యంపై జగన్ కు నమ్మకం లేదన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.

ఒక వేళ అసెంబ్లీకి హాజరైనా.. విమర్శలు వస్తాయి. ఎందుకంటే… ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయలేదన్న కారణంగానే… తాము అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని ఇప్పటి వరకూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు… మళ్లీ ఎందుకు వస్తున్నారన్న విమర్శలు టీడీపీ నుంచి వస్తాయి. దీనికి సరైన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి ఉంది. అయితే.. ఈ విమర్శల కన్నా.. అసెంబ్లీకి డుమ్మా కొట్టడం వల్ల వచ్చే విమర్శలే వైసీపీకి ఎక్కువ డ్యామేజీగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని గతంలోనే ప్రచారం జరిగింది. చివరి సమావేశాల్లో అయినా జగన్ అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close