అప్పుడు మీ రక్తం ఎందుకు మరగలేదు బాబు?

నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తన ఉగ్రరూపాన్ని చూపించిన విషయం తెలిసిందే. బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యల మీద విరుచుకు పడిన చంద్రబాబు, తన రక్తం మరుగుతోంది అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే బాబు చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది. బీజేపీ చేసిన అన్యాయం పై బాబు గట్టిగా మాట్లాడుతున్నాడు అని కొంతమంది హర్షం వ్యక్తం చేస్తే మరి కొంత మంది మాత్రం నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా ఆ పాపంలో వాటా ఉంది అని, చంద్రబాబు ఇప్పుడు రక్తం మరుగుతోంది అనడం హాస్యాస్పదం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు , రక్తం మరుగుతోంది అన్న బాబు వ్యాఖ్యలను ట్రోలింగ్ చేస్తున్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలు:

ముందుగా బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, కేంద్రానికి స‌రైన నివేదిక‌లు ఇస్తే, తాను స్వ‌యంగా ఢిల్లీకి వెళ్లి నిధులు తీసుకొస్తా అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్ర‌హించిన ముఖ్య‌మంత్రి ‘ఎవ‌రి కోసం ఇస్తార‌య్యా… కొత్త రాష్ట్రం కాబ‌ట్టి. ఎవ‌డ‌బ్బ సొమ్ము ఇది..? నా ర‌క్తం మరిగిపోతోంది. ఊడిగం చేస్తారా మీరీ రాష్ట్రంలో..? ఎవ‌రికి ఊడిగం చేస్తారు..? ఏం చేస్తార‌య్యా మ‌మ్మ‌ల్ని… జైల్లో పెడ‌తారా మీరు? అంటూ విరుచుకుపడ్డారు.

అయితే సోషల్ మీడియా లో మాత్రం, రక్తం మరిగిపోతోంది అన్న చంద్రబాబు కామెంట్స్ పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. బాబు గతంలో రకరకాల సందర్భాల్లో తీసుకున్న యూటర్న్ లే దీనికి కారణం అనిపిస్తోంది. పలు సందర్భాలలో చంద్రబాబు తీసుకున్న వైఖరి పై ప్రశ్నలు సంధిస్తూ రక్తం మరిగిపోతుంది అన్న బాబు కామెంట్లను నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. వారి ప్రశ్నలు ఇలా ఉన్నాయి:

నెటిజన్ల ప్రశ్నలు:

2008లో బేషరతుగా తెలంగాణ ఇవ్వాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాసినప్పుడు ఎందుకని రక్తం మరగలేదు? మీరు ఎంతో గొప్ప విజన్ ఉన్న నాయకుడు అయి ఉండి కూడా, బేషరతుగా ఎందుకని మద్దతు ఇచ్చారు. అప్పుడే ఆంధ్ర ప్రదేశ్ కి ఇవి ఇచ్చి తెలంగాణను ప్రకటించమని మీరు ఎందుకు కోరలేదు?

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం అని చెప్పి అధికారం లోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వము, కేవలం ప్యాకేజీ మాత్రమే ఇస్తాం అని చెప్పినప్పుడు మీకు రక్తం ఎందుకు మరగలేదు? ఆ ప్రభుత్వం లో మీరు కూడా భాగస్వామి అయినప్పటికీ, అప్పుడు మీ రక్తం ఎందుకు మరగలేదు?

ఆ ప్యాకేజీ పరమ ప్రసాదం అని తీసుకుని , వెంకయ్యనాయుడు తదితర బిజెపి లీడర్ లకు తెలుగుదేశం పార్టీ నాయకులు సన్మానాలు చేసినప్పుడు మీ రక్తం ఎందుకు మరగలేదు?

నాలుగేళ్ల పాటు ఎన్డీయే లో వున్నప్పుడు పలుమార్లు కేంద్రాన్ని వెనకేసుకొస్తూ, ప్రత్యేక హోదా సంజీవని కాదు అని, ప్రత్యేక హోదా అని అంటే జైలుకే అని అన్నప్పుడు, ప్రత్యేక హోదా కోసం బంద్ లు చేసిన వాళ్ల మీద కేసులు పెట్టినప్పుడు రక్తం మరగలేదా?

తీరా నాలుగేళ్లు అయిపోయాక ఆఖరి ఏడాది, ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బిజెపితో కలిసి ఉంటే వారితో పాటు తామూ మునుగుతామని గ్రహించి, నెపాన్ని మొత్తం బిజెపి మీద నెట్టేసి తాను బయటకు వచ్చిన చంద్రబాబు, తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేసిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజధాని కూడా లేకుండా ఆంధ్ర వాసులని గెంటేసిందో, అదే కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకున్నప్పుడు రక్తం మరగలేదా?

ఏ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అయితే పార్లమెంటులో తెలుగుదేశం ఎంపీల మీద దాడి చేశారో అదే పార్టీతో తెలంగాణ ఎన్నికల సందర్భంలో పొత్తు పెట్టుకున్నప్పుడు రక్తం మరగలేదా?

మొత్తం మీద:

మొత్తం మీద బాబు చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది. బాబు గతంలో తీసుకున్న యూ-టర్న్ లే ఇప్పుడు నెటిజన్ల ప్రశ్నల కి కారణం అని స్పష్టంగా తెలుస్తోంది.

– జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close