ఇట్స్ అఫీషియల్..! తొమ్మిదో తేదీన టీడీపీలోకి గౌరు దంపతులు..!

కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వైఎస్ కుటుంబానికి అత్యంత ఆత్మీయులైన గౌరు కుటుంబం… తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకుంది. తమ ప్రత్యర్థి అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని.. టిక్కెట్ ఖరారు చేయడం.. తమ రాజకీయ భవిష్యత్‌కు కనీస భరోసా ఇవ్వకపోవడంతో.. వారు అసంతృప్తికి గురయ్యారు. మూడు రోజుల పాటు వరుసగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పాణ్యం నుంచి తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తామని… ఈ నెల తొమ్మిదో తేదీన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతామని ప్రకటించారు.

గౌరు వెంకటరెడ్డి అంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో గౌరు కుటుంబానికి.. వైఎస్ చాలా ప్రాధాన్యమిచ్చారు. వైఎస్ చనిపోయిన తరవాత వారి కుటుంబం జగన్ వెంట నడిచింది. గత ఎన్నికల్లో గౌరు చరితకు పాణ్యం టిక్కెట్ ఇచ్చారు జగన్. ఆ సమయంలో.. పాణ్యంలో బలమైన అభ్యర్థిగా ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా.. ఆమె విజయం సాధించారు. అయితే.. ఆ తర్వాత గౌరు చరిత సోదరుడు..మాండ్ర శివానందరెడ్డి టీడీపీలోచేరారు. అప్పట్నుంచి జగన్ గౌరు కుటుంబాన్ని దూరం పెట్టడం ప్రారంభించారు. చివరికి టిక్కెట్ నిరాకరించడానికి కాటసాని రాంభూపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు.

మాండ్ర శివానందరెడ్డి టీడీపీలో చేరిన తర్వాత కూడా.. గౌరు కుటుంబసభ్యులు జగన్‌కు విధేయులుగానే ఉన్నారు. కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకే మెజార్టీ ఉందని తెలిసినప్పటికీ… జగన్ ఆదేశం మేరకు పోటీ చేసి.. గౌరు వెంకటరెడ్డి ఓడిపోయారు. అయితే.. తన వర్గానికి ఉన్న పలుకుబడితో.. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా చక్రపాణిరెడ్డికి చమటలు పట్టించారు. చాలా స్వల్ప తేడాతోనే శిల్పా చక్రపాణిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత నంద్యాల ఉపఎన్నిక సమయంలో.. శిల్పా బ్రదర్స్ వైసీపీలో చేరి… ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఇలా.. తమకు ప్రత్యర్థులుగా ఉన్న వారందర్నీ వైసీపీలో చేర్చుకోవడం.. చివరకు తమకు టిక్కెట్ లేకుండా చేయడంతో..రాజకీయ భవిష్యత్ కోసం వారు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెట‌ర‌న్‌ల‌కు వెండి తెర స్వాగ‌తం

క్రికెట్‌లో వెట‌రన్ అనే మాట ఎక్కువ‌గా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన త‌ర‌వాత‌.. వాళ్లంతా వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ప‌రిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వ‌చ్చింది. దాంతో రిటైర్ ఆట‌గాళ్లంతా కోచ్‌లుగా, మెంట‌ర్లుగా మారుతున్నారు....

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close