సిస్టర్ సెంటిమెంట్ తో స్టార్ హీరోలు..!

స్టార్ హీరో సినిమా అనగానే అడ్వెంచర్స్ తో కూడుకున్న సినిమాలని ప్రేక్షకులు ఓ అంచనాలకు వస్తారు. అయితే అదే థోరణిలో సినిమాలను తీయడానికి హీరోలకు కూడా బోర్ కొట్టేస్తుంది. అందుకే అప్పడప్పుడు సెంటిమెంట్ సినిమాలను కూడా చేస్తుంటారు. ఇప్పటికే స్టార్ సినిమాల్లో సెంటిమెంట్ తో కూడుకున్న సినిమాలు చేసిన హీరోలు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్స్ మీద చాలా సినిమాలు వచ్చాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఎమోషనల్ డ్రామాలో కూడా తనంత నటన ఎవరికి సాధ్యం కాదు అనిపించేలా చేస్తాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రాఖి’ అంటూ వచ్చి ప్రతి ఒక్క అమ్మాయికి అన్నలా ఆదరాభిమానాలు సంపాధించాడు తారక్. ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా తన అక్క మీనాక్షి ప్రాణాలకు అపాయం ఉందని తెలిసి ఆమెను కాపాడటానికి పడే పాట్లు కూడా ‘అర్జున్’ సినిమాలో చూపించాడు. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సిస్టర్ సెంటిమెంట్ మీద సినిమాలు చేయలేదు కాని మదర్ సెంటిమెంట్ మీద సినిమాలు చేశాడు. యోగి, చత్రపతి సినిమాలు ఆ కోవలో వచ్చి సక్సెస్ సాధించినవే.

ఇక ప్రస్తుతం ఆ వంతు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కు వచ్చింది. స్టైల్ కు సరికొత్త నిర్వచనం చెప్పి మెగా అభిమానుల్లో వైబ్రేషన్స్ కలిగించే పవర్ స్టార్ ఇప్పుడు సిస్టర్ సెంటిమెంట్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే అన్నవరం సినిమాతో తనలో ఉన్న అన్నతనాన్ని చూపించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న పవర్ స్టార్ ఇప్పుడు మరోసారి సిస్టర్ సెంటిమెంట్ తో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడట. అది కూడా కోలీవుడ్ లో ఘన విజయం సాధించిన వేదలం రీమేక్ గా ఈ సినిమా ఉండబోతుందట. సినిమాకు దర్శకుడిగా కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ను సెలెక్ట్ చేసుకున్నట్టు సమాచారం. అయితే స్టార్ హీరోలంతా ప్రయత్నించిన ఈ సిస్టర్ సెంటిమెంట్ ను పవర్ స్టార్ మరోసారి చేయడం మంచి విషయం అనే చెప్పాలి. ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close