ఆ త‌రువాత తెలుగుదేశం పార్టీ ముక్క‌లౌతుంద‌ట‌.!

ఈ శీర్షిక చూడ‌గానే ఎవ‌రికైనా ఇట్టే అర్థ‌మౌపోతుంది… ఇది వైకాపా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి చేసిన వ్యాఖ్య అని! ట్విట్ట‌ర్ లో ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేయ‌డం ఆయ‌న‌కి అల‌వాటు క‌దా! అదే క్ర‌మంలో తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్ల‌లో ఇలాంటిది ఒక‌టుంది. ఆయన ఏమంటారంటే…. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం తెలుగుదేశం పార్టీ క‌నుమ‌రుగైపోవ‌డం ఖాయ‌మ‌ని జోస్యం చెప్పారు. ఆ పార్టీ ముక్క‌లు కాబోతోందని చెప్పారు. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ఆశ‌యాల‌కూ సిద్ధాంతాల‌కు అనుగుణంగా చంద్ర‌బాబు తీరు ఉండ‌టం లేద‌నీ, దీంతో ఆ పార్టీకి చెందిన చాలామందిలో చంద్ర‌బాబుపై అసంతృప్తి ఉంద‌నీ, కాబ‌ట్టి టీడీపీతో తిరుగుబాటు వ‌చ్చే అవ‌కాశం ఉందని ఆయ‌న అంటున్నారు. పార్టీలో ఇలాంటి ప‌రిస్థితి ఉంది కాబ‌ట్టే, మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని చంద్ర‌బాబు నాయుడు వాయిదా వేసుకున్నార‌ని ఆయ‌న చెప్పారు! ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఇలాంటి వింత‌లు టీడీపీలో చాలాచాలా జ‌ర‌గ‌బోతున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

నిజానికి, మహానాడు వాయిదా వేసింది ఎందుకంటే… ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత‌, వ‌రుస‌గా దాదాపు ఓ ప‌దిరోజుల‌పాటు రాష్ట్ర‌, జాతీయ రాజ‌కీయాల్లో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించాల్సిన స‌మ‌యం. జాతీయ స్థాయిలో కూట‌మి, రాష్ట్రంలో వ్య‌వ‌హారాలపై పార్టీ నేత‌లంతా బిజీబిజీగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఆ టైంలో ఏ ప్ర‌ధాన పార్టీలోనైనా ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌హానాడు నిర్వ‌హించే కంటే… కొద్దిరోజులు వాయిదా వేసుకుంటే మేలు అనేది ఆ పార్టీ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. అంతేగానీ, టీడీపీ అంత‌ర్గ‌త క‌ల‌హాలున్నాయ‌నీ, పార్టీ ముక్క‌లైపోయే ప‌రిస్థితి ఉందని ఒక్క విజ‌య‌సాయి రెడ్డికి త‌ప్ప‌, ఇలాంటి కార‌ణం ఎవ్వ‌రికీ క‌నిపించ‌లేదు. అధికారంలో ఉన్నా లేక‌పోక‌పోయినా మ‌హానాడు నిర్వ‌హించుకోవ‌డం ఆ పార్టీకి ఒక ఆన‌వాయితీ. ఇంకోటి, తెలుగుదేశం పార్టీకి నాయ‌క‌త్వ లేమి లేదు. విజ‌య‌సాయి చెప్తున్న‌వి ఊహాజ‌నిత ప‌రిస్థితులు!

ఒక పార్టీ మీద ఈ స్థాయిలో ట్వీట్లు చేస్తూ, ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఫ‌లానా పార్టీ ఏదో అయిపోతోంద‌ని విజ‌య‌సాయి వ్యాఖ్యానించ‌డం వ‌ల్ల ఎవ్వ‌రికైనా ఉప‌యోగం ఉందా? ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత‌, టీడీపీ అధికారంలోకి వ‌చ్చిందే అనుకుందాం. ఇప్పుడీ ట్వీట్ల‌ను ఫాలో అవుతూ, వాటిని చూస్త ఆనందిస్తున్న వైకాపా అభిమానులు విజ‌య‌సాయి రెడ్డి గురించి ఆ త‌రువాత ఏమ‌నుకుంటారు? ఇలాంటి అవాకులూ చ‌వాకులూ మాట్లాడుతూ పోతే… రేప్పొద్దున్న‌, ఆయ‌న చెప్పిన మాటల్లో నిజం ఉండ‌దు అనే ప‌రిస్థితి ఆ పార్టీ అభిమానుల్లోనే వ‌స్తే ప‌రిస్థితి ఏంటి? ఇలాంటి ట్వీట్లు చేసేముందు ఆయ‌న ఈ త‌ర‌హా ఎప్పుడూ ఆలోచిస్తున్న‌ట్టు లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close