పోలవరంపై జగన్ విధానం ఫెయిరేనా..?

పోలవరం ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి. టీడీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఇప్పుడీ ప్రాజెక్ట్ నిర్మాణం ఒక్క సారిగా నెమ్మదించింది. అయితే.. కొత్త సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం.. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడమే తమ లక్ష్యం అంటున్నారు. కావాలంటే ప్రాజెక్టును సందర్శిస్తానంటున్నారు. మరి నిధుల సంగతి ఎలా తేల్చుకుంటారు..!?

ప్రాజెక్ట్ వ్యయంపై కేంద్రం భరోసా కోసం జగన్ ఏం చేస్తారు..?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటి వరకు చురుగ్గా సాగింది. దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. మరో ఏడాది పాటు ఇదే స్పీడు కొనసాగితే .. ప్రాజెక్టు నిర్మాణం దాదాపు ఒక కొలిక్కి వచ్చేసినట్లే. గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఈ ఏడాది ఎన్నికలు ముగిసే నాటికి దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత భిన్నాభిప్రాయాలువ్యక్తమవుతున్నాయి. కాపర్ డ్యాంల పనులు ఆపేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ ఆర్ కే జైన్ అధికారులను ఆదేశించారు. దాంతో ఆ పనులకు బ్రేక్ పడింది. ఉభయగోదావరి జిల్లాలో ప్రాజెక్టుకు ఎగువన ఉన్న మండలాల్లో ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేస్తేనే ప్రాజెక్టులో నీరు నిల్వ చేయడానికి సాధ్యమవుతుంది. ముంపు గ్రామాల వారికి పునరావాసం కింద ఇళ్ల నిర్మాణాన్ని కూడా చేపట్టారు. అవి పూర్తయితేనే వారు అక్కడ నుంచి బయటకు కదిలేది. మరి వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎప్పుడు అమలు చేస్తారనేది ఇంకా తేలలేదు.

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేస్తేనే ప్రాజెక్టులో నీటి నిల్వ..!

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. నిధుల కొరత ఉండడంతో … ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అంశంపై కొత్త ప్రభుత్వం అనేక రకాలుగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కేంద్రం కూడా నిధులు మంజూరు చేస్తేనే,ఈ ప్యాకేజీని అమలుచేయడం సాధ్యం అవుతుందని పోలవరం ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం నిధులు ఎప్పుడు మంజూరు చేస్తుందో తెలీని పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. నిర్మాణ పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీకి అప్పగించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇలా అనేక చిక్కుముడులు ప్రస్తుతం ప్రాజెక్టు చుట్టూ అల్లుకున్నాయి.

పోలవరం అథారిటీ పదేపదే ఎందుకు కొర్రీలు పెడుతోంది..?

దానికి తోడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా ఇటీవల తరుచుగా క్షేత్ర స్దాయిలో సమీక్షలు చేస్తోంది. కొన్ని అంశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన పిపీఏ సభ్యులు..ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు, నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం పనులు సాగుతున్న తీరు పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై.. ప్రాజెక్ట్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఆర్థిక భారం అనిపిస్తే… ఏదో సాకు చెప్పి ఆపేయడానికి అవకాశం ఉంది. అలా జరిగితే.. మళ్లీ దాన్ని పట్టాలెక్కించడం అంత తేలిక కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ రివ్యూ: కాన్సెప్ట్ విత్ లాజిక్!

Prasanna Vadanam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ 2.75/5 -అన్వ‌ర్‌ ఈరోజుల్లో ప్రేక్ష‌కుల‌కు విజువ‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్ అయినా ఇవ్వాలి, లేదంటే కాన్సెప్ట్ తో అయినా క‌ట్టి ప‌డేయాలి. ఈ రెండింటిలో ఏది లేక‌పోయినా సినిమా...

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కుదరదన్న తెలంగాణ హైకోర్టు

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి గుడ్ న్యూస్ లు వరుసగా వినిపిస్తున్నాయి. అప్రూవర్ గా మారిన దస్తగిరి తనను జైల్లో పెట్టి.. పెద్ద ఎత్తున ప్రలోభపెట్టడమే కాకుండా......

‘ఆ ఒక్కటీ అడక్కు’ రివ్యూ: క్లాసిక్ టైటిల్ చెడ‌గొట్టారు

Aa Okkati Adakku Movie review తెలుగు360 రేటింగ్ 2.25/5 -అన్వ‌ర్‌ ఒకప్పుడు అల్లరి నరేష్ నుంచి కామెడీ సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ వుండేది. తర్వాత పరిస్థితి మారింది. ఆయనపై కామెడీ కథలు సరిగ్గా...

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close