2022లోనే ఏపీ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు..!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు మళ్లీ 2024లోనే జరగాల్సి ఉంది. కానీ రెండు, మూడేళ్ల ముందే వస్తాయని… వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన పత్రిక సాక్షి ఊహిస్తోంది. ఈ మేరకు.. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించి.. ఏపీలో మారుతున్న రాజకీయాలకు.. వాటిని కలిపి.. కాస్త ఆసక్తికరమైన కథనాలను.. ఎడిటోరియల్ పేజీలోనే ప్రచురిస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ సాక్షిలో ” రెండో మాట” పేరుతో ఆర్టికల్ రాస్తున్నారు. ఆ ఆర్టికల్‌లో.. 2022లోనే ఏపీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయన్న అంశాన్ని హైలెట్ చేశారు.

ముందస్తు సమాచారం వల్లే సాక్షి యాజమాన్యం ఇవి రాయిస్తోందా..?

సాధారణంగా.. సాక్షి దినపత్రికలో.. ఎలాంటి రాజకీయ వార్తలైనా… వైసీపీ రాజకీయ సిద్దాందాలకు… అనుగుణంగా ఉంటేనే ప్రచురిస్తారు. ఎంత పెద్ద జర్నలిస్టుకు అయినా.. అలా రాసేవారు అయితే మాత్రమే… సాక్షి పత్రిక.. ప్రొత్సహిస్తుంది. లేకపోతే లేదు. అనేక మంది సుప్రసిద్ధ కాలమిస్టులకు.. వైసీపీ పెద్దల నుంచి … ఫలానా అంశంపై.. ” కాలమ్ ” కావాలని అడుగుతారని.. ఆ ప్రకారం వారు రాసి పంపుతారని అంటున్నారు. ఈ కోణంలోనే… ఢిల్లీలో విస్తృతంగా జరుగుతున్న ముందస్తు జమిలీ ఎన్నికలు… ఏపీలో.. టీడీపీ నేతలు వరుసగా బీజేపీలో చేరడం.. వంటి పరిణామాలను లింక్ కలిపి… రాజకీయ విశ్లేషణ చేసినట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా.. ముందస్తు జమిలీ పేరుతో ఏపీలోనూ… రెండు, మూడేళ్ల ముందు ఎన్నికలు పెడతారనే సందేహం.. వైసీపీలోనే అంతకంతకూ పెరగడానికి ఇలాంటి ఆర్టికల్స్ సాక్ష్యమనే భావన వ్యక్తమవుతోంది.

చంద్రబాబు కోటరీనే బీజేపీలో చేరడమే వైసీపీ అనుమానాలకు కారణమా..?

భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఫుల్ స్వింగ్లో ఉంది. టీడీపీ నేతల్ని వరుసగా చేర్చుకుంటూ.. అధికారం మాదేననే ప్రకటనలు చేస్తున్నారు. ఇదే వైసీపీని ఆందోళనకు గురి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలే బీజేపీలో చేరడంతో.. వైసీపీ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. 2022లోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారని.. అప్పుడు.. బీజేపీ – టీడీపీ పొత్తు పెట్టుకుంటాయని.. దానికి ఇప్పుడు బీజేపీలో చేరిన నేతలే కీలకపాత్ర పోషిస్తారన్న అనుమానాలను సాక్షి వ్యక్తం చేస్తోంది.

నిజంగానే జమిలీపై బీజేపీ చాలా సీరియస్…!

జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైన సమయంలో… దేశంలోని ప్రతీ రాష్ట్రంలోనూ… తమ పార్టీ ప్రభుత్వం లేదా.. మిత్రపక్షం ఉండేలా చూసుకోవాలని.. బీజేపీ పెద్దలు లక్ష్యంగా పెట్టుకున్నారు. అసాధ్యంగా అనిపిస్తున్న.. ఏపీ, తెలంగాణలపైనే వారు ప్రధానంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే.. ఏపీ, తెలంగాణల్లో.. చేరికల హడావుడి చేస్తున్నారని చెబుతున్నారు. ఇటు చేరికలను పూర్తి చేసి.. పార్టీని బలోపేతం చేయడానికి… అటు జమిలీపై.. రాజ్యాంగ సవరణలు… ఇతర కసరత్తు చేయడానికి కనీసం మూడేళ్లు పడుతుందని.. బీజేపీ అగ్రనేతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ మూడేళ్లలో.. కసరత్తు పూర్తి చేసి.. మిగతా లాంఛనాలు కూడా.. అయితే.. రెండేళ్ల ముందే.. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే 2022లో జమిలీ ఎన్నికలు పెట్టొచ్చు. ఏ ఏడాది దాదాపుగా ఎనిమిది రాష్ట్రాలకు.. అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఏడాది మరో ఐదు రాష్ట్రాలకు జరగాల్సి ఉంది. 2022లో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటన్నింటినీ కలిపేసి.. 2022లో పెట్టడానికి.. బీజేపీ అంతర్గత కసరత్తు చేస్తోందని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. ఇదే వైసీపీని ఆందోళనకు గురి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్: విజ‌య్ దేవ‌ర‌కొండ ‘డ‌బుల్ ట్రీట్’

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈనెల 9... విజ‌య్ పుట్టిన రోజున అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇదో పిరియాడిక్...

వైఎస్ ఫ్యామిలీ స్టోరీలో చెల్లికి అన్ననే విలన్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిది ఎంత నేరో మైండో షర్మిల ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం అంటే.. వారి వ్యక్తిత్వాన్ని కించ పర్చడమే అని జగన్ రెడ్డి అనుకుంటూ...

చైతన్య : టాలీవుడ్ పౌరుషం ఇంతేనా ?

సినీ పరిశ్రమ ఏపీలో లేదు. కానీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఎంతగా వేధించిందో చూస్తే టాలీవుడ్ లో భాగం అనుకునే ఎవరికైనా పళ్లు పటపట కొరకాలని అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి దేశ రెండో...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..?

పోలింగ్ కు ముందే బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని , తమతో టచ్ లోనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. చేరికలకు సంబంధించి రాష్ట్ర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close