జగన్ పాలనకు నెల..! తేడా చూపించినట్లేనా..?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కచ్చితంగా నెల రోజులయింది. ఈ నెల రోజుల్లో..  ఆయన సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అనేక మంది మదిని మరిపించే… సంతోషకర నిర్ణయాలు ప్రకటించారు. వాటి ఫలాలు ఇంకా… ఆయా వర్గాలకు అందలేదు కాబట్టి.. ఇప్పటికైతే ప్రకటనల్లో సంతోషం మాత్రం చూసుకుంటున్నారు. అదే క్రమంలో… కొంత ఆందోళన కూడా వివిధ వర్గాల్లో కనిపిస్తోంది. ప్రభుత్వం చిన్న చిన్న సమస్యలు అనుకుంటుందేమో కానీ.. అసలైన వాటిపై అసలు దృష్టే పెట్టడం లేదు.

కడుపు నింపేసిన తొలి ప్రకటనలు..!

మంత్రివర్గ తొలి సమావేశంలోనే 50 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500, రైతుల పంటల బీమా ప్రీమియం చెల్లింపు , పెన్షన్ రూ. 250 పెంపు,  పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, హోంగార్డులు, డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్‌పర్సన్ల జీతాల పెంపు, గ్రామ వాలంటీర్ల నియామకాలు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు అమ్మ ఒడి పథకం అమలు ఇలా చాలా.. ప్రకటనలు చేశారు. ఇవన్నీ అమల్లోకి రావాల్సి ఉంది.

సామాన్యుల సమస్యల పరిష్కారంపై కనీస చూపేది..?

నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను.. అనేక కష్టాలు చుట్టుముట్టాయి. మొదటగా.. కరెంట్ కోతలు. విచిత్రం ఏమిటో కానీ..  ప్రభుత్వం మారగానే కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయి. అనేక చోట్ల ప్రజలు ధర్నాలు చేశారు. దీనిపై.. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు లాంటి వాళ్లు.. కరెంట్ ఉంది కానీ.. దృష్టి పెడితే చాలని వ్యాఖ్యానించారు. అయినా ఎవరూ దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత విత్తనాల సమస్య. సిక్కోలు నుంచి అనంతపురం వరకూ.. విత్తనాల కోసం రైతులు బారులు తీరుతున్నారు. ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పట్టించుకున్న నాధుడు లేడు. ఇక ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి డబ్బులు అందక రైతులు కూడా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ప్రభుత్వానికి చిన్న చిన్న సమస్యలే కావొచ్చు కానీ.. ప్రజలకు మాత్రం పెద్దవే. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం వీటిపై కనీస దృష్టి కూడా పెట్టలేదు.

పొరుగు రాష్ట్రానికి ఇచ్చుడే కానీ.. ఏమైనా తెచ్చారా..?

పొరుగు రాష్ట్రంతో సన్నిహిత సంబంధాల పేరుతో.. జగన్మోహన్ రెడ్డి.. ఏపీకి అన్యాయం చేస్తున్నారన్న  భావన ఈ నెల రోజుల్లో ప్రజల్లో పెరిగిందంటే.. దానికి కారణం.. ప్రభుత్వ వ్యవహారశైలే .  మంత్రివర్గం ఏర్పాటు కాక ముందే.. హైదరాబాద్ లోని ఏపీ భవనాలన్నింటినీ తెలంగాణకు ఇచ్చేశారు. కానీ ఏపీకి రావాల్సిన వాటి గురించి మాట్లాడలేదు. ఆ తర్వాత ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్లొచ్చారు. ఏపీ ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. ఇక ఉమ్మడి సంస్థలు, కరెంట్ బకాయిల గురించి… మాట్లాడుతున్నామంటున్నారు కానీ.. ఎక్కడా సానుకూలత లేదు. ఉద్యోగుల సమస్యలూ అంతే. ఈ నెల రోజుల్లో సన్నిహిత సంబంధాలతో… తెలంగాణ భారీగా లాభపడిందని స్పష్టమవుతోంది. మరి ఏపీకి ఏమొచ్చిందో.. ప్రభుత్వమే ప్రకటించాల్సి ఉంది.

అవినీతి పేరుతో అభివృద్ధి పనుల నిలిపివేత..!

జగన్ సీఎం కాగానే… అభివృద్ధి పనులన్నీ ఎక్కడివక్కడ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దాంతో.. ఎక్కడ కూడా.. ప్రాజెక్టులు కానీ.. ప్రభుత్వ పనులు కానీ జరగడం లేదు. అమరావతిపై సరైన విధానం ప్రకటించకపోయే సరికి.. అక్కడా రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. సాగునీటి ప్రాజెక్టుల్లో కదలిక లేదు. మొత్తానికి అవినీతి పేరుతో… అభివృద్ధిని మాత్రం నిలిపివేశారు. అవినీతిని వెలికి తీయడానికి.. పనులు నిలిపివేయాల్సిన అవసరం ఏమిటో చాలా మందికి అర్థం కాదు. కానీ సర్కార్ చేసింది.. అంగీకరించాలసిందే.

కక్ష సాధింపుతో కొత్త తరహా రాజకీయమా..?

నెల రోజుల్లో… ప్రభుత్వం నిర్మాణాలకు ఎలాంటి ప్రణాళికలు వేయలేదు కానీ.. కూల్చివేతలకు మాత్రం రంగం సిద్ధం చేసుకుంది. ప్రజల సొమ్ముతో కట్టినప్రజావేదికను కూల్చివేసింది. ఇక కరకట్ట మీద ఉన్న ఇళ్లనూ కూల్చివేస్తామంటోంది.  ప్రభుత్వ  కట్టడం కాబట్టి.. ఎవరూ అడ్డురాలేదు. కరకట్టపై ఉన్న ఇళ్లన్నింటికీ అనుమతులు ఉన్నాయని అక్కడి నిర్మాణదారులు గేట్లకు బోర్డులు వేలాడదీశారు. ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించాలి కానీ.. వారే ప్రభుత్వం నుంచి ఇలా రక్షణ కోరుకోవడం… అసాధారణ విషయం. ఇది ఏపీలో కనబడుతోంది. ఇక రాజకీయ దాడులు.. మాజీ సీఎం సహా.. టీడీపీ నేతలకు .. సెక్యూరిటీ తగ్గింపు.. ఇవన్నీ.. ప్రజల్లో అనుమానాలు, సందేహాలు లెవనెత్తేలా చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రోడికి కాస్త ఊర‌ట‌

అల్ల‌రి న‌రేష్ 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ నెగిటీవ్ రివ్యూలే. ఈవీవీ సూప‌ర్ హిట్ టైటిల్ ని చెడ‌గొట్టార‌ని, కామెడీ ఏమాత్రం పండ‌లేద‌ని విశ్లేష‌కులు...

మరో డీఐజీ రెడ్డి గారికి ఊస్టింగ్ ఆర్డర్స్

పోలింగ్ కు ముందు వైసీపీ అరాచకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పోలీసు అధికారులపై ఈసీ గట్టిగానే గురి పెట్టింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఎన్నికల...

సందీప్ సినిమాలో ‘మ‌న్మ‌థుడు’ హీరోయిన్‌

'మ‌న్మ‌థుడు'లో క‌థానాయిక గా మెరిసిన అన్షు గుర్తుంది క‌దా? ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యాక అన్షుకి మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. కానీ.. రెండు మూడు సినిమాల త‌ర‌వాత‌.. లండ‌న్ వెళ్లిపోయింది....

గుంటూరు జిల్లా టీడీపీలో చేరికల హుషారు !

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ పూర్తిగా బలహీనపడుతోంది. ఆ పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వరుసగా టీడీపీలో చేరిపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అనేక మంది టీడీపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close