గాయాన్ని లెక్క చేయ‌ని నాగ‌శౌర్య‌

ఇటీవ‌లే ఓ షూటింగ్‌లో నాగ‌శౌర్య గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. వైజాగ్‌లో ఓ ఛేజింగ్ స‌న్నివేశం తెర‌కెక్కిస్తున్న‌ప్పుడు నాగ‌శౌర్య కాలు బెణికింది. దాంతో… షూటింగ్ కి అర్థాంత‌రంగా దూరం అవ్వాల్సివ‌చ్చింది. శౌర్య ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. కానీ.. మ‌ళ్లీ షూటింగ్ మొద‌లెట్టేశాడు. మిగిలిన న‌టీన‌టుల డేట్లు క్లాష్ వ‌స్తున్నందు వ‌ల్లే.. నాగ‌శౌర్య గాయం నుంచి పూర్తిగా కోలుకోక‌పోయినా సెట్లోకి అడుగుపెట్టాల్సివ‌చ్చింద‌ని చిత్ర‌బృందం తెలిపింది. ఈసారి ర‌న్నింగులూ, ఛేజింగులూ లాంటివేం పెట్టుకోకుండా కొన్ని కీక‌ల స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఐరా ప్రొడ‌క్ష‌న్స్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి శౌర్య‌నే నిర్మాత‌. ‘అశ్వ‌ద్ధామ‌’ అనే పేరు ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆ ఒక్కటీ అడక్కు’ రివ్యూ: క్లాసిక్ టైటిల్ చెడ‌గొట్టారు

Aa Okkati Adakku Movie review తెలుగు360 రేటింగ్ 2.25/5 -అన్వ‌ర్‌ ఒకప్పుడు అల్లరి నరేష్ నుంచి కామెడీ సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ వుండేది. తర్వాత పరిస్థితి మారింది. ఆయనపై కామెడీ కథలు సరిగ్గా...

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close