అసెంబ్లీలో మట్లాడేందుకు రోజాకు చాన్సివ్వడం లేదా..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు.. హాట్ హాట్ గా సాగుతున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ.. ఏదో ఓ అంశంపై..అధికార ప్రతిపక్షాల మధ్య… హోరాహోరీ పోరు సాగుతోంది. మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సహజంగా సంఖ్య ఎక్కువ …అధికార పార్టీ కాబట్టి వైసీపీ వాయిస్ ఎక్కువ వినిపిస్తోంది. చాలా మంది మాట్లాడుతున్నారు. టీడీపీపై ఎంత ఘాటు విమర్శలు చేయాలో.. ఎలాంటి ఆరోపణలు చేయాలో.. అన్నీ చేస్తున్నారు. ఈ హడావుడిలో… గత అసెంబ్లీలో కాక పుట్టించిన ఓ గొంతు మాత్రం వినిపించడం లేదనే సంగతిని ఎవరూ గుర్తించడం లేదు. ఆ గొంతు.. నగరి ఎమ్మెల్యే.. ఫైర్ బ్రాండ్ రోజాది.

రోజా మంచి వక్త. ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఆమె.. రాజకీయ నేతలకు కావాల్సిన టాకింగ్ పవర్ ఉంది. అయితే.. ఆమె లాంగ్వేజ్‌లో కాస్త అతి ఉంటుందని.. అందరూ అంటారు. గత అసెంబ్లీలో ఆమె చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం అంతా ఇంతా కాదు. అసెంబ్లీ బయట కూడా.. ” నన్ను రేప్ చేసే ధైర్యం ఉందా.?” అంటూ జర్నలిస్టులపై కన్నెర్ర చేసిన ఘటనలు ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఆ తర్వాత ఆమె నోటి నుంచి మగతనం అనే మాటలు అసువుగా వచ్చేస్తూంటాయి. గత అసెంబ్లీలో వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఆమె వాగ్ధాటికి అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ.. ఇప్పుడు.. వైసీపీ అధికారపక్షం. ఆమె అసెంబ్లీలో మాట్లాడితే.. అడ్డుపడే వాళ్లు కూడా ఉండరు. అయితే.. అనూహ్యంగా.. ఆమెకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రావడం లేదు. ఇప్పటి వరకు చాలా అంశాలపై చర్చ జరిగినా.. ఒక్క సారి కూడా రోజా కల్పించుకోలేదు. మాట్లాడే అవకాశం స్పీకర్ కూడా ఇవ్వలేదు.

రోజానే అసెంబ్లీలో మాట్లాడకూడదని అనుకుంటున్నారని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ.. రోజా.. తన వాగ్ధాటిని అసెంబ్లీలో చూపించుకోవాలని ఎందుకనుకోరని.. ఇతరులు ప్రశ్నిస్తున్నారు. కానీ.. ఆమె ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుందోనన్న సంశయంతోనే.. వైసీపీ వ్యూహాత్మకంగా.. మాట్లాడేవారి జాబితాలో రోజాను చేర్చలేదని చెబుతున్నారు. రోజాకు మాట్లాడే ఉద్దేశం లేకపోతే.. ఆమె మీడియా పాయింట్‌లో కూడా మాట్లాడకుండా ఉంటారు. కానీ.. ఒకటి, రెండు సార్లు మీడియా పాయింట్‌లో కూడా మాట్లాడారు. తనదైన శైలిలో టీడీపీపై.. చంద్రబాబుపై విమర్శలు చేశారు. కానీ అసెంబ్లీలో మాత్రం మాట్లాడే అవకాశం దొరకడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close