జగన్ నుంచి మోడీపైకి గురి మార్చిన ముద్రగడ..!

కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం… తన జాతి రిజర్వేషన్ల కోసం ఎవరితో పోరాడాలన్న కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లుగా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో.. చంద్రబాబు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లను క్యాన్సిల్ చేసిన జగన్‌ను నిందించారో… చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన.. ఐదు శాతం కోటా రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించలేదని.. ప్రధాని మోడీని డిమాండ్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్లుగా.. తాజా లేఖలు బయట పెడుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీకి.. ముద్రగడ పద్మనాభం నేడు ఓ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే.. చంద్రబాబు.. కాపులను బీసీల్లో చేర్చుతూ.. ఐదు శాతం కోటా ఇచ్చారని.. ఆ కోటాకు ఆమోద ముద్రవేయాలని.. కోరడం. లేఖలో.. గతంలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవని.. తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి తీసేశారని మొదటగా గుర్తు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేయాలని కోరారు.

ఇటీవలి కాలంలో ముద్రగడపై ఒత్తిడి పెరుగుతోంది. చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్లు జగన్ క్యాన్సిల్ చేసినా.. ఎలాంటి పోరాట ప్రణాళిక ప్రకటించడం లేదని.. సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఏ కోర్టు కొట్టి వేయనప్పటికీ.. ఎందుకు… ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాల్సి వచ్చిందో… ముద్రగడ లేఖ రాసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. అయినా ముద్రగడ లైట్ తీసుకున్నారు. రిజర్వేషన్ల కోసం.. ఏదో ఓ ఉద్యమం చేయాలని… ఆయనపై ఒత్తిడి వస్తోందని చెబుతున్నారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సర్కార్ పై ఉద్యమం చేయడానికి ఆయన సిద్దంగా లేరని… అందుకే.. వీలైనంతగా.. దాన్ని కేంద్రం వైపు మళ్లించాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ పీఎంవోకి చేరుతుందో లేదో కానీ… ఆయన.. తెలుగులో లేఖ రాశారు. ప్రధాని.. లేదా.. ఇతర ఢిల్లీ స్థాయి వ్యవహారాల్లో అధికార ఉత్తరాలు.. ఇంగ్లిష్‌లోనే రాస్తారు. అలా రాస్తేనే.. కాస్త వెసులుబాటు అక్కడ ఉండే అధికారులకు ఉంటుంది. లేకపోతే.. ప్రాధాన్యత క్రమంగా పక్కన పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే.. ముద్రగడ మాత్రం.. ఎప్పుడు.. ఎవరికి లేఖలు రాసినా.. తెలుగులోనే రాస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకూ అయితే.. ఎవరూ పట్టించుకోరు కానీ.. మోడీకి కూడా.. తెలుగులోనే రాస్తూండటంతో.. ఆయన చిత్తశుద్ధి మీద… కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close