అమరావతికి మద్దతు..! రాజధాని రైతుల కోసం పవన్ పోరాటం.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజధాని రైతులకు మద్దతుగా నిలిచారు. వారి సమస్యలపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిని మారుస్తుందనే ప్రచారం జరుగుతూండటంతో… రాజధాని రైతులంతా.. ఓ సంఘంగా ఏర్పడి… రాజకీయ పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ముందుగా భారతీయ జనతా పార్టీ అధినేత కన్నా లక్ష్మినారాయణను గుంటూరులో కలిశారు. మద్దతు కోరారు. ఆయన అమరావతిని అక్కడే నిర్మించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని… చెల్లించాల్సిన కౌలును వెంటనే చెల్లించాలని.. ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో.. జనసేన అధినేత మద్దతు కోసం… రైతులు హైదరాబాద్‌ వెళ్లారు. పవన్ కల్యాణ్ ను కలిశారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని .. పవన్ కు తెలియచేసి మద్దతు కోరారు.

రాజధాని రైతుల సమస్యలను… పవన్ కల్యాణ్ సావధానంగా విన్నారు. వారికి మద్దతుగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. రాజధాని రైతుల ఆవేదనను అర్థం చేసుకున్నా…వారికి అండగా ఉంటానని ప్రకటించారు. రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని మరింత మెరుగ్గా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని.. రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదు…రాష్ట్రమంతటిదన్నారు. వారితో సమావేశం ముగిసిన వెంటనే.. రాజధానిలో తన పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్నారు. ఈ నెల ఈ నెల 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్.. రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లోనూ విస్తృతంగా పర్యటించనున్నారు. ప్రతీ గ్రామంలోనూ.. భూములిచ్చిన రైతులతో మాట్లాడతారు. అలాగే.. అమరావతిలో నిలిచిపోయిన పనులను కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత… ఏపీ సర్కార్ … అనుసరిస్తున్న తీరుపై.. తన పోరాట కార్యాచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది.

గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజధానికి భూములు ఇవ్వడానికి ఇష్టపడని వారికి మద్దతుగా.. పోరాటం చేశారు. పలుమార్లు.. రాజధానిలో.. పర్యటించారు. ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇవ్వని వారు చేసిన ఆందోళనలో పాలు పంచుకున్నారు. రాజధానికి అంత భూమి ఎందుకని.. విమర్శలు కూడా చేశారు. అప్పట్లో రాజధాని రైతులు.. పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. 95 శాతం మందికిపైగా రైతులు స్వచ్చందంగా భూములు ఇస్తే.. ఐదు శాతం కోసమే.. పవన్ మాట్లాడుతున్నారని… తమ ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడరని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు.. పవన్ ఆ రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచారు. వారి కోసం.. రాజధానిలో పర్యటించబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

“ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్” చుట్టూ ఏపీ రాజకీయం !

ఆంధ్రప్రదేశ్ రాజకీయం క్లైమాక్స్ కు చేరుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా అందరి నోట్ల నలుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. ఆ చట్టంలో ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close