చంద్రబాబు అడిగినా ఇవ్వలేదు..! ఇప్పుడు జగన్ అడిగే పరిస్థితి లేదు..!

ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇవ్వాలంటూ.. చంద్రబాబునాయుడు.. ఐదేళ్లలో నలభై సార్లు ఢిల్లీకి వెళ్లారు. కేంద్రమంత్రుల్ని పదే పదే కలిసేవారు. ఆయన ఒత్తిడిని తట్టుకోలేక… ఎంతో కొంత… నిధులు.. ఏపీకి విడుదల చేసేవారు. అయితే.. వాటికి సంతృప్తి చెందని.. అప్పటి సీఎం.. బీజేపీకి గుడ్ బై చెప్పారు. నిజానికి ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయ పరిమైనదేనని అందరికీ తెలుసు. అందుకే.. ఆ తర్వాత నుంచి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదు. చివరికి… వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను కూడా ఆపేశారు. ఎన్ని సార్లు తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ.. వాటిని విడుదల చేయలేదు. ప్రభుత్వం మారి నాలుగు నెలలైనా… కూడా విడుదల చేయలేదు.

అప్పట్లో.. చంద్రబాబు వారానికో సారి సందర్భాన్ని చూసుకుని… కేంద్రం నిధులివ్వడం లేదని…మండిపడేవారు. అయితే అసెంబ్లీ.. లేకపోతే ప్రెస్‌మీట్.. అదీ కాకపోతే.. ఏదో ఓ బహిరంగసభ పెట్టుకుని బీజేపీపై విరుచుకపడేవారు. పదే పదే ప్రశ్నించేవారు. ఇప్పుడు మాత్రం కేంద్రాన్ని అడిగేవారే లేరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… 22 మంది ఎంపీలున్నప్పటికీ.. ఉన్నా.. లేనట్లేనన్నట్లుగా ఉన్నారు. కేంద్రానికి నిధుల కోసం.. ఇంత వరకూ ఒక్క వినతి పత్రం ఇచ్చినట్లుగా కనిపించలేదు. రాష్ట్రానికి ఫలానా ప్రాజెక్టు కావాలని అడిగిందీ లేదు. బడ్జెట్‌లో రూపాయి కేటాయించకపోయినా… స్పందించలేదు. దీంతో. .. ఏపీ వైపు నుంచి బీజేపీపై ఒత్తిడి తగ్గిపోయింది.

ఇదే విషయాన్ని కమ్యూనిస్టు పార్టీ నేతలు గుర్తు చేసి.. బీజేపీ నేతలపై మండిపడుతున్నారు. గతంలో ఏపీకి నిధులను చంద్రబాబు అడిగినా ఇవ్వలేదని.. ఇప్పుడు జగన్ అడిగే పరిస్థితి లేదన్నారు. ఏపీ కోసం తామున్నామంటూ.. గొప్ప గొప్ప ప్రకటనలు చేసే.. బీజేపీ నేతలు.. జీవీఎల్, కన్నా ఏమయ్యారని… సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేరుగానే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా జీవీఎల్ నరసింహారావుపై ఆయన మండిపడుతున్నారు. జీవీఎల్‌కు నోరు పడిపోయిందా అని ప్రశ్నించారు. విభజన సమస్యలు.. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన వాటిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కానీ.. బీజేపీ నేతలు.. చంద్రబాబు ఉన్నప్పుడు.. టెన్షన్ తో ఉండేవారు. ప్రజలకు ఏం చెప్పాలా.. అనే కంగారు ఉండేది. ఇప్పుడు ఏమీ చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రభుత్వమే అడగనప్పుడు వారు మాత్రం ఏం చెబుతారు…?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close