ఇన్ సైడ్ టాక్‌: ఉయ్యాలవాడ‌ వంశస్థుల్ని ఎలా బుజ్జ‌గించారు?

సైరా విడుద‌ల‌కు ముందు కాస్త హ‌డావుడి న‌డిచింది. కోర్టులో వాద ప్ర‌తివాద‌న‌లు జోరుగా సాగాయి. సైరా విడుద‌ల‌కు ఏమైనా బ్రేకులు ప‌డ‌తాయా? అన్న భ‌యం కూడా క‌లిగింది. ఈ సినిమా విష‌యంలో మ‌మ్మ‌ల్నివాడుకుని, ఆర్థికంగా అండ‌గా నిల‌బ‌డ‌తామ‌ని మాటిచ్చి త‌ప్పార‌ని, త‌మ‌కు న్యాయం చేయాల‌ని పిటీష‌న్ దారులు కోరుకున్నారు. వీటిపై కోర్టు స్పందించింది. సైరా బృందానికి అనువుగా తీర్పు ఇచ్చింది. ఓ సినిమా విడుద‌ల‌ను అడ్డుకోవ‌డం క‌ష్ట‌మ‌ని, అది స్వేచ్ఛ హ‌క్కుకి అడ్డుక‌ట్ట వేయ‌డ‌మే అని, సినిమాని ఓ వినోద సాధ‌నంగా మాత్ర‌మే చూడాల‌ని కోర్టు సూచించింది. ఆ త‌ర‌వాత‌.. ఉయ్యాల‌వాడ‌ వంశ‌స్థులు కేసుని ఉప‌సంహ‌రించుకోవ‌డం, సైరా బృందానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం జ‌రిగిపోయాయి.

తెర వెనుక ఉయ్యాల‌వాడ‌ వంశ‌స్థుల్ని బుజ్జగించ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయితే దాదాపు 5 కోట్లు డిమాండ్ చేయ‌డం వ‌ల్ల‌.. ఈ కేసు కోర్టులోనే చూసుకుందామ‌ని సైరా బృందం ఫిక్స‌య్యింది. దానికి త‌గ్గ‌ట్టుగానే కోర్టులో సైరా బృందానికి అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. అయితే ఇక ముందు ఎలాంటి గోల గొడ‌వ లేకుండా.. ఈ విష‌యాన్ని సామ‌ర‌స్య పూర్వ‌కంగానే ప‌రిష్క‌రించుకోవాల‌నుకుంది సైరా బృందం. మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా కేసు వేసిన ఆరుగురికి చెరో మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల చెప్పున ఆర్థిక స‌హాయం చేశార‌ని స‌మాచారం. అంతేకాదు… ఉయ్యాలవాడ లో న‌ర‌సింహారెడ్డి పేరుతో కొన్ని సేవా కార్య‌క్ర‌మాలు చేస్తామ‌ని చ‌ర‌ణ్ మాటిచ్చాడ‌ట‌. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వ‌స్తానని చెప్పాడ‌ట‌. దాంతో.. ఉయ్యాల‌వాడ వంశ‌స్థులు కూల్ అయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close