అన్ని చోట్లా “ఆనం” చెప్పినట్లే ఉందంటోన్న ఆంధ్రజ్యోతి..!

నెల్లూరు మాఫియా గుప్పిట్లో ఉందని.. సమర్థంగా పని చేసే అధికారిని మా ఎమ్మెల్యేలు ఉండనీయరని ఎమ్మెల్యే ఆనం వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యలు… ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. అది ఆ పార్టీ రాజకీయం. కానీ.. ఆనం చేసిన వ్యాఖ్యలను… ఆంధ్రజ్యోతి… తనదైన శైలిలో ప్రజల ముందు ఉంచుతోంది. నెల్లూరులోనే కాదు.. రాష్ట్రం మొత్తం.. మాఫియా చెలరేగిపోతోందని… ఎవరైనా పోలీసు అధికారులు.. ఆ మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. వారికి బదిలీనే బహుమానం అవుతోందని అంటున్నారు. కొంత మంది ఎస్పీలను బలవంతంగా సెలవులో పంపించేసిన వైనాన్ని కూడా గుర్తు చేస్తూ.. సమగ్రమైన కథనాన్ని ప్రచురించింది.

ఆరు నెలల వైసీపీ పాలనలో… ఐపీఎస్‌ అధికారుల బదిలీలు.. వరుసగా జరుగుతున్నాయి. పాలన చేపట్టిన మొదట్లో.. పూర్తి గా సంస్కరించారు. గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టి.. ఇతరులకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. వారిలో చాలా మంది.. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వింటున్నారు కానీ… కొంత మంది.. మాత్రం.. తాము ఐపీఎస్ ట్రైనింగ్‌లో ఏది నేర్చుకున్నారో దాన్నే అమలు చేస్తున్నారు. దాంతో.. అధికారం అందిన ఊపులో… కొత్త తరహా దందాలకు దిగిన వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. స్వయంగా.. ప్రభుత్వాధినేతను కూడా.. కొంత మంది ఎస్పీలు మెప్పించలేకపోయారు. ఫలితంగా అందరిపై వేటు పడింది. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల ఎస్పీల బదిలీలే దీనికి నిదర్శమని ఆంధ్రజ్యోతి చెబుతోంది.

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ఆయా అధికార పార్టీ నేతలు.. చట్టవిరుద్ధంగా.. కొన్ని పనులు చేసి.. డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. ప్రభుత్వంలో ఉండే పెద్దల సాయంతో.. దందాల్ని కొనసాగించుకుంటారు. అయితే.. అవి ప్రజలకు ఇబ్బంది లేకుండా… కొన్ని ప్రభుత్వాలు చూసుకుంటాయి. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదని.. ఆంధ్రజ్యోతి.. వైసీపీ నేతల వ్యాఖ్యాలను హైలెట్ చేస్తూ.. విశ్లేషణాత్మక కథనం రాసింది. ఆనం వ్యాఖ్యాలను మరింతగా ప్రజల్లో చర్చ జరిగేందుకు ఈ వ్యూహాన్ని ఆంధ్రజ్యోతి అవలంభించిందని అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close