చిరుపై గురి పెట్టిన హ‌రీష్ శంక‌ర్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ భ‌క్తుడిగా పేరు తెచ్చుకున్నాడు హ‌రీష్ శంక‌ర్‌. గ‌బ్బ‌ర్ సింగ్‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు. ఆ స్థాయి హిట్ ఆ త‌ర‌వాత హ‌రీష్‌కి ద‌క్క‌లేదు. ఇప్పుడు ప‌వ‌న్‌తో మ‌రోసారి క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాడు. త్వ‌రలోనే ఈ గ‌బ్బ‌ర్ కాంబో ప‌ట్టాలెక్క‌నుంది. అయితే ఆ వెంట‌నే చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని భావిస్తున్నాడు హ‌రీష్‌. చిరు కోసం ఇది వ‌ర‌కెప్పుడో ఓ క‌థ త‌యారు చేశాడు హ‌రీష్‌. చిరు ఓకే అంటే వినిపించ‌డానికి రెడీ అని చాలాసార్లు చెప్పాడు. అయితే ఈమ‌ధ్య చిరంజీవిని క‌లిసిన‌ప్పుడు హ‌రీష్ ద‌గ్గ‌రున్న క‌థ గురించి చ‌ర్చ న‌డిచింద‌ని స‌మాచారం. చిరు కూడా హ‌రీష్‌తో ప‌నిచేయ‌డానికి చూచాయిగా అంగీక‌రించార‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని హ‌రీష్ కూడా ఒప్పుకుంటున్నాడు. త్వ‌ర‌లో చిరంజీవితో ప‌నిచేసే అవ‌కాశాలున్నాయ‌ని హింట్ ఇస్తున్నాడు. ప‌వ‌న్ తో సినిమా హిట్ట‌యితే త‌ప్ప‌కుండా చిరుతో ప‌నిచేసే అవ‌కాశం త‌లుపు త‌ట్టిన‌ట్టే. ఇప్ప‌టికే ప‌వ‌న్‌, అల్లు అర్జున్‌, వ‌రుణ్‌తేజ్‌ల‌తో పని చేసేశాడు హ‌రీష్‌. చిరుతో కూడా సినిమా చేసేస్తే మెగా ఫ్యామిలి (చ‌ర‌ణ్ త‌ప్ప‌) అంద‌రితోనూ ఓ రౌండ్ పూర్త‌యిన‌ట్టు ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close