ఖమ్మంలో అఖిల్ హడావిడి..!

అక్కినేని అఖిల్ ఆటోనడిపి ఓ మూడు వేలు సంపాదిస్తే.. ఎలా ఉంటుంది.. అదేంటి అఖిల్ ఆటోనడపటం ఏంటి.. మూడు వేలు సంపాధించడం ఏంటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అవును నిజమే నండి మంగళవారం అక్కినేని అఖిల్ ఖమ్మంలో ఓ అభిమానిని కలుసుకునేందుకు వచ్చారు. ఖమ్మం ఎన్.ఎస్.పి కాలనీకి చెందిన అశ్విత్ రెడ్డి కొద్దిరోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతుండటంతో తన అభిమాన నటుడు అఖిల్ ను కలవాలనే ఆశని వ్యక్తపరిచాడు. ఇక విషయం తెలుసుకున్న స్వచ్చంద సంస్థ వారు ఈ విషయాన్ని అఖిల్ కు తెలియచేసి ఇక్కడకు రప్పించారు.

అఖిల్ సినిమాతో అక్కినేని మూడో తరం వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ ఆ సినిమాలో తన గ్రేస్ ను చూపించాడు. మంచు లక్ష్మి చారిటీ ద్వారా చిన్నారిని పరామర్శించిన అఖిల్ సరదాగా సిటీలో ఆటో నడపటం జరిగింది. ఆటో డ్రైవర్ గా పనిచేసినందుకు మూడు వేలు రూపాయలు వసూలు చేసి అశ్విత్ రెడ్డికి అందచేసిన అఖిల్ ఆ స్వచ్చంద సంస్థ ద్వారా మూడు లక్షల రూపాయాల ఆర్ధిక సహాయాన్ని అందించడం జరిగింది.

ఆరేళ్ల అశ్విత్ రెడ్డి కొద్దిరోజూగా కిడ్నీ సమస్యతో బాధపడుతుండటంతో విషయం తెలుసుకున్న లక్ష్మి చారిటీ మేము మేము సైతం ద్వారా ఆ పిల్లాడిని అఖిల్ చేత కలిపించి తన కోరికను నెరవేరేలా చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close